Chiranjeevi: టార్గెట్ ఆగస్ట్ అంటోన్న గాడ్‌ఫాదర్..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. గతేడాదే రిలీజ్ కావాల్సిన ఆచార్య, కరోనా నేపథ్యంలో వరుసగా.....

Chiranjeevi: టార్గెట్ ఆగస్ట్ అంటోన్న గాడ్‌ఫాదర్..?

Chiranjeevi Plans To Release Godfather Movie In August

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. గతేడాదే రిలీజ్ కావాల్సిన ఆచార్య, కరోనా నేపథ్యంలో వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే, చిరు తన నెక్ట్స్ సినిమాలను వరుసబెట్టి పట్టాలెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ఫాదర్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు మెగాస్టార్.

Godfather: చిరుతో సల్మాన్.. ముంబైలో మొదలు కానున్న యాక్షన్!

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా గాడ్‌ఫాదర్ వస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించేయాలని చిరంజీవి భావిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా ముంబైలో పూర్తి చేసింది చిత్ర యూనిట్.

దీంతో ఇక మిగతా షూటింగ్‌ను అతి త్వరలో ముగించేసి ఈ సినిమాను ఆగస్టు నాటికి రెడీ చేయాలని చిరు ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాను ఆగస్టులో ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ చేయాలని ఆయన భావిస్తున్నాడు. ఆగస్టులో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేకపోవడంతో ఆ సమయంలో గాడ్‌ఫాదర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తే, అది ఖచ్చితంగా సినిమాకు బాగా కలిసొస్తుందని మెగాస్టార్ ఆలోచిస్తున్నాడట. అందుకే ఈ సినిమాను ఆగస్టు 11 లేదా 12న రిలీజ్ చేస్తే, స్వాతంత్ర్య దినోత్సవ సెలవులు కూడా కలిసొస్తాయని ఆయన భావిస్తున్నాడు.

Godfather : చిరంజీవి సినిమాలో గద్దర్ ?

అయితే ఆగస్ట్ నెలలో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘బింబిసారా’ కూడా రిలీజ్‌ను లాక్ చేసుకుంది. దీంతో ఈ సినిమా ప్రొడ్యూసర్స్‌తో చిరంజీవి చర్చించి, గాడ్‌ఫాదర్ రిలీజ్‌కు లైన్‌ను క్లియర్ చేసుకోవాలని చూస్తున్నాడట. మరి నిజంగానే గాడ్‌ఫాదర్ టార్గెట్ ఆగస్ట్ అంటూ దూసుకెళ్తాడా లేదా అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.