Godfather : చిరంజీవి సినిమాలో గద్దర్ ?

మెగాస్టార్ చిరంజీవి నటించనున్న న్యూ మూవీ ‘గాడ్ ఫాదర్’ సినిమాకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Godfather : చిరంజీవి సినిమాలో గద్దర్ ?

Gaddar

Gaddar And Chiranjeevi  :మెగాస్టార్ చిరంజీవి నటించనున్న న్యూ మూవీ ‘గాడ్ ఫాదర్’ సినిమాకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రజా గాయకుడు, జననాట్య మండలి కళాకారుడు గద్దర్ ఓ కీలక పాత్ర పోషించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read More : Bandla Ganesh : పవన్ కళ్యాణ్ జీవితమిస్తే…చిరంజీవి ప్రాణం పోశారు

దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం చిత్ర యూనిట్ ఆయన్ను సంప్రదించారని, ఇందుకు గద్దర్ ఒకే చెప్పారనే వార్తలు గుప్పుమంటున్నాయి. వైజాగ్ జైలులో చిత్రీకరించే సన్నివేశంలో ఆయన కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్, కోలీవుడ్ ఇతర స్టార్ నటులను కూడా నటింప చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందని తెలుస్తోంది.

Read More : Chiranjeevi : టాలీవుడ్ పెద్దన్నయ్య చిరంజీవి..

రాజకీయాల నుంచి సినిమా రంగ ప్రవేశం చేసిన చిరు..వరుస ఫిల్మ్స్ కు ఒకే చెబుతూ..బిజీ బిజీగా గడుపుతున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత…ఉయ్యాల వాడ నర్సింహరెడ్డిలో నటించారు. అనంతరం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు మెగాస్టార్. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. అనంతరం ‘లూసిఫర్’ చిత్ర రీమెక్ గా రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’ చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నారు.

Read More : Ajay Kumar Puvvada : మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసిన తెలంగాణ మంత్రి.. కారణం అదేనా?

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్ వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అనంతరం ‘భోళా శంకర్’ చిత్రంలో కూడా మెగాస్టార్ నటించనున్నారు. మరి ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో గద్దర్ నటించనున్నారా ? లేదా ? అనేది చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.