Rocketry: The Nambi Effect – నంబి నారాయణన్ క్యారెక్టర్‌లో వెర్సటైల్ యాక్టర్ మాధవన్.. ట్రైలర్ అదిరిపోయిందంతే..
విలక్షణ నటుడు ఆర్.మాధవన్ తన కెరీర్‌లో మరోసారి ప్రయోగానికి తెర లేపారు. ప్రముఖ శాస్త్రవేత్త అనంత నారాయణ్ మహదేవన్ జీవిత కథ ఆధారంగా టైటిల్ రోల్ పోషిస్తూ, ఆయన దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’..

R Madhavans Rocketry Telugu Trailer
Rocketry: విలక్షణ నటుడు ఆర్.మాధవన్ తన కెరీర్‌లో మరోసారి ప్రయోగానికి తెర లేపారు. ప్రముఖ శాస్త్రవేత్త అనంత నారాయణ్ మహదేవన్ జీవిత కథ ఆధారంగా టైటిల్ రోల్ పోషిస్తూ, ఆయన దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’..
హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. గురువారం హిందీ ట్రైలర్ హృతిక్ రోషన్, తెలుగు ట్రైలర్ మహేష్ బాబు, తమిళ్ ట్రైలర్ మాధవన్ రిలీజ్ చేశారు. ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ కంప్లీట్‌గా మాధవన్ వన్ మేన్ షో అని చెప్పొచ్చు.
కీలక పాత్ర కోసం : 14 గంటలు కుర్చీలోనే
నంబి నారాయణన్ క్యారెక్టర్‌లో వివిధ గెటప్స్‌లో మాధవన్ నటన ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో సూర్య కనిపించి సర్‌ప్రైజ్ చేశారు. మాధవన్ భార్యగా సీనియర్ నటి సిమ్రాన్ కనిపించారు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్‌గా కుదిరాయి.
Congratulations on your directorial debut @ActorMadhavan. #RocketryTheNambiEffect trailer looks compelling! Looking forward to watching it on the big screen! Wishing you the best always. ??https://t.co/NCPBulmdUs@NambiNOfficial @TricolourFilm @vijaymoolan pic.twitter.com/QBmozRdDSW
— Mahesh Babu (@urstrulyMahesh) April 1, 2021
ఈ క్యారెక్టర్‌లో నటించేందుకు రెండేళ్లు పడితే, ఆ పాత్ర కోసం రెడీ అవడానికి 14గంటలపాటు కుర్చీలోనే కూర్చోవాల్సి వచ్చిందంటే మాధవన్ ఈ రోల్ కోసం మాధవన్ ఎంత కష్ట పడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది వేసవిలో ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.