Raashi Khanna: నాకు ఏ పాపం తెలియదు అంటోన్న రాశి..!
టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడి.. ఒక స్థాయి వచ్చాక వేరే ఇండస్ట్రీలో అవకాశాలు వెత్తుకుంటూ చాలా మంది వెళ్తుంటారు. అయితే.. వారు......

Raashi Khanna Clarity On Her Comments About South Film Industry
Raashi Khanna: టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడి.. ఒక స్థాయి వచ్చాక వేరే ఇండస్ట్రీలో అవకాశాలు వెత్తుకుంటూ చాలా మంది వెళ్తుంటారు. అయితే.. వారు తమకు గుర్తింపును తీసుకొచ్చిన టాలీవుడ్‌పై పలు వివాదాస్పద కామెంట్స్ చేస్తుండటం మనం గతంలో చూశాం. అయితే తాజాగా దక్షిణాది సినిమాలు, ప్రేక్షకులపై అందాల భామ రాశి ఖన్నా చేసిన కామెంట్స్ ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి.
Raashi Khanna : రాశీ ఖన్నా గురించి తెలియాలంటే.. ఈ మూడు పనులు చెయ్యాల్సిందే మరి..
దక్షిణాది ప్రేక్షకులు కేవలం అందాన్ని మాత్రమే చూస్తారని.. వారికి రొటీన్ సినిమాలే ఎక్కువ ఇష్టమని.. కానీ తనకు ఇలాంటివి ఏమాత్రం ఇష్టంలేకపోయినా సౌత్‌లో అలాంటి సినిమాలకే అలవాటు పడ్డానంటూ రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా సౌత్ ఆడియెన్స్.. రాశిపై విరుచుకుపడ్డారు. తనకు ఇంతటి స్టార్‌డమ్, గుర్తింపును తీసుకొచ్చిన సౌత్ సినిమా ఇండస్ట్రీపై ఇలాంటి కామెంట్స్ చేస్తావా అంటూ రాశిఖన్నాపై నెటిజన్స్ ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో తనపై వస్తున్న వ్యతిరేకతను చూసిన రాశి ఖన్నా, తన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చింది.
Raashi Khanna: హోమ్లీ లుక్ నుండి హాట్ నెస్ లోకి రాశి!
తాను సౌత్ ఇండస్ట్రీ గురించి ఎలాంటి కామెంట్స్ చేయలేదని.. తనకు అన్ని భాషలు, అన్ని ఇండస్ట్రీలు సమానమని చెబుతోంది ఈ బబ్లీ బ్యూటీ. అంతేగాక తనకు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలు అంటే గౌరవం అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. తానంటే గిట్టని వారు ఎవరో ఇలా తనపేరిట కామెంట్స్ చేస్తున్నారంటూ రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. దయచేసి తన పేరుతో వస్తున్న వార్తలను సోషల్ మీడియా నుండి తొలగించాలంటూ ఆమె ఈ సందర్భంగా కోరింది. ఏదేమైనా రాశి ఖన్నా చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద దుమారే రేపడంతో వాటిని చల్లబరిచేందుకు ఇప్పుడు ఆమె ప్రయత్నిస్తుందని పలువురు కామెంట్ చేస్తున్నారు.
??? pic.twitter.com/yQa1nOacEY
— Raashii Khanna (@RaashiiKhanna_) April 6, 2022