Rains In Telangana: రుతుపవనాలు రాకముందే వర్షాలు.. కారణం ఏంటంటే?
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం సాయంత్రం నుండి వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. మే 31 నాటికే కేరళలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. రుతుపవనాలు ఆలస్యమైనా రాష్ట్రంలో మాత్రం పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి.

Rains Before The Onset Of Monsoons What Is The Reason
Rains In Telangana: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం సాయంత్రం నుండి వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. మే 31 నాటికే కేరళలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. రుతుపవనాలు ఆలస్యమైనా రాష్ట్రంలో మాత్రం పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వానలు కురవగా.. పలుచోట్ల భారీ వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి. ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, యాదాద్రి జిల్లాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి.
అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా కురవిలో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా యాదాద్రి భువనగిరి, నల్గొండ, రాజన్న సిరిసిల్ల జిల్లా, మెదక్, వరంగల్ అర్బన్, రూరల్, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, నాగర్ కర్నూల్‌తో పాటు పలు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు జల్లులు కురిశాయి. ఇక, రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. నైరుతి, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది.
ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల వద్ద ఏర్పడగా.. గాలి విచ్ఛిన్నతి తెలంగాణపై సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు ఉంది. దీని ప్రభావంతోనే రుతుపవనాలు రాకముందే రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. మరోవైపు నైరుతి రుతు పవనాలు మరింత బలపడగా వచ్చే 24 గంటల్లో కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుండగా.. వాటి ప్రభావంతోనే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.