భూమి పూజలో పాల్గొన్న రజినీకాంత్

భూమి పూజలో పాల్గొన్న రజినీకాంత్

Updated On : February 10, 2021 / 2:45 PM IST

Rajinikanth: సౌతిండియన్ సూపర్‌స్టార్, తలైవా రజినీకాంత్ అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత మొదటిసారి మీడియాకి కనిపించారు. పెద్ద కుమార్తె ఐశ్యర్య, అల్లుడు ధనుష్ చైన్నైలోని పోయిస్ గార్డెన్ లో నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటి భూమి పూజ కార్యక్రమంలో రజినీ పాల్గొన్నారు.

Dhanush

ధనుష్, ఐశ్వర్య, రజినీ, ఆయన సతీమణి లతా రజినీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల ‘అన్నాత్తే’ షూటింగులో అనారోగ్యానికి గురైన రజినీ.. రాజకీయాలనుండి తప్పుకుంటున్నట్లు కూడా ప్రకటించారు.

Rajinikanth

ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ‘కర్ణన్’ డబ్బింగ్ పూర్తి చేసిన ధనుష్, అన్నయ్య సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తన 43వ సినిమా చేస్తున్నాడు ధనుష్.

Dhanush