The Family Man 2 : సమంత క్యారెక్టర్ ఎంత పని చేసింది..? ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ చుట్టూ వివాదాలు..

‘ది ఫ్యామిలీ మ్యాన్-1’ కు కొనసాగింపుగా రూపొందించిన వెబ్ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్- 2’ తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిని బ్యాన్‌ చేయాలని ఎండీఎంకే అధినేత, రాజ్యసభ సభ్యుడు వైకో.. కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు లేఖ రాశారు..

The Family Man 2 : సమంత క్యారెక్టర్ ఎంత పని చేసింది..? ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ చుట్టూ వివాదాలు..

Rajya Sabha Mp Vaiko Seeks Ban On The Family Man 2

Updated On : May 24, 2021 / 12:58 PM IST

The Family Man 2: ‘ది ఫ్యామిలీ మ్యాన్-1’ కు కొనసాగింపుగా రూపొందించిన వెబ్ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్- 2’ తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిని బ్యాన్‌ చేయాలని ఎండీఎంకే అధినేత, రాజ్యసభ సభ్యుడు వైకో.. కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు లేఖ రాశారు. తమిళులను తీవ్రవాదులుగా చూపించారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళులను పాకిస్థాన్‌ ఏజెంట్లుగా చూపించారని ఫిర్యాదు చేశారు.

The Family Man 2 : తమిళ వివాదంలో సమంత.. సోషల్ మీడియాలో ట్రోల్స్..

తమిళం మాట్లాడే సమంతను తీవ్రవాదిగా చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ను బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు వైకో. దర్శకుడు రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ డైరెక్ట్ చేశారు. ఫస్ట్ సీజన్‌లో నటించిన మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణిలతో పాటు సెకండ్ సిరీస్‌లో అక్కినేని సమంత కీలక పాత్రల్లో కనిపించారు. అయితే అనుకోని విధంగా ఈ వెబ్ సిరీస్ వివాదంలో చిక్కుకుంది. ఈ సిరీస్‌పై తమిళ ప్రజలు గుర్రుగా ఉన్నారు..

తమిళ ప్రజల సంస్కృతి సంప్రదాయాలను కించపరుస్తూ… తమిళుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించారని వైకో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వెబ్ సిరీస్‌ను తమిళ ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని… ఇది ఓటీటీలో రిలీజ్ కాకుండా అడ్డుకోవాలని వైకో కేంద్రాన్ని కోరారు. తమిళ ప్రజల సెంటిమెంట్స్‌ను గుర్తించకుండా… ఈ వెబ్ సిరీస్‌ను రిలీజ్ చేస్తే… తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు..