The Family Man 2 : తమిళ వివాదంలో సమంత.. సోషల్ మీడియాలో ట్రోల్స్..
ట్రైలర్లో తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుని, అంచనాలు పెంచేసింది.. అయితే సమంతకి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి..

The Family Man 2
The Family Man Season 2: వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి జంటగా వచ్చిన ఫ్యామిలీ అండ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మెన్’.. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది.. గతకొద్ది రోజులుగా సీజన్ 2 కోసం అంతా ఎదురు చూస్తున్నారు.
‘ది ఫ్యామిలీ మెన్ 2’ తో స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో సమంత రాజీ అనే శ్రీలంక తమిళియన్‌గా సరికొత్త క్యారెక్టర్లో కనిపించనుంది.. ట్రైలర్లో తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుని, అంచనాలు పెంచేసింది.. అయితే సమంతకి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి..
ఈ సిరీస్‌లో సామ్ టెర్రరిస్ట్ క్యారెక్టర్ చేస్తోంది.. కాగా సమంత రోల్ నచ్చలేదంటూ తమిళనాడు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక తమిళ అమ్మాయివి అయ్యిండి తమిళ్ టెర్రరిస్ట్‌గా ఎలా నటిస్తావ్? అంటూ నెటిజన్లు సమంతపై మండిపడుతూ.. #Man #FamilyMan2 అనే హ్యాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో ఆమెను బాగా ట్రోల్ చేస్తున్నారు..