The Family Man Season 2 : సమంత క్యారెక్టర్ హైలెట్‌గా ‘ది ఫ్యామిలీ మెన్’ సీజన్ 2.. ట్రైలర్ అదిరిందిగా..!
ఇప్పుడు ‘ది ఫ్యామిలీ మెన్’ సీజన్ 2 రాబోతోంది.. ఈ సీజన్‌లో స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని కీలక పాత్రలో కనిపించనుంది. బుధవారం ‘ది ఫ్యామిలీ మెన్’ సీజన్ 2 ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉండడమే కాక సిరీస్‌పై అంచనాలను పెంచేసింది..

The Family Man
The Family Man Season 2: వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి జంటగా వచ్చిన ఫ్యామిలీ కమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మెన్’.. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ఫిల్మ్‌ఫేర్స్ గెలుచుకుని మోస్ట్ వ్యూడ్ సిరీస్‌గా నిలిచింది.
ఇప్పుడు ‘ది ఫ్యామిలీ మెన్’ సీజన్ 2 రాబోతోంది.. ఈ సీజన్‌తో స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. బుధవారం ‘ది ఫ్యామిలీ మెన్’ సీజన్ 2 ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉండడమే కాక సిరీస్‌పై అంచనాలను పెంచేసింది.
మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి రోల్స్ ఫస్ట్ సీజన్ కంటే మరింత ఆసక్తికరంగా అనిపించాయి.. సమంత రాజీ అనే శ్రీలంక తమిళియన్‌గా సరికొత్త క్యారెక్టర్‌లో కనిపించింది.. యాక్షన్ సీన్స్‌లో సామ్ యాక్టింగ్ అదిరిపోయింది.. ఈ సిరీస్‌లో సమంత క్యారెక్టర్ హైలెట్ కానుంది. జూన్ 4 నుండి అమెజాన్ ప్రైమ్‌లో ‘ది ఫ్యామిలీ మెన్’ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది.