రకుల్‌కు కరోనా.. ఎమోషనల్ పోస్ట్..

Rakul Preet Singh: కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పడుతుంది అనుకుంటుండగా.. మళ్లీ విజృంభిస్తోంది.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక మూల నుండి ఏదో ఒక రూపంలో వైరస్ సోకుతూనే ఉంది.. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు దీని బారిన పడి కోలుకున్నారు.. తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారినపడింది..
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిందామె..
‘‘పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను, ఫీలింగ్ బెటర్.. త్వరలో పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను.. షూటింగులో పాల్గొంటాను.. దయచేసి రీసెంట్‌గా నన్ను కలిసిన వారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను’’.. అని పోస్ట్ చేసింది రకుల్..
ఇటీవల ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో రకుల్ ఏ రేంజ్‌లో రచ్చ చేసిందో చూశాం.. కాగా క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది రకుల్.. ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే..
View this post on Instagram