‘ఉప్పెన’ టీంకి చరణ్ శుభాకాంక్షలు.. స్టైలిష్ ‘లైగర్’, సినిమా చూసిన మెగా ఫ్యామిలీ..

‘ఉప్పెన’ టీంకి చరణ్ శుభాకాంక్షలు.. స్టైలిష్ ‘లైగర్’, సినిమా చూసిన మెగా ఫ్యామిలీ..

Updated On : February 13, 2021 / 9:10 PM IST

Uppena Team: ‘ఉప్పెన’.. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి కథానాయికగా, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో బ్లాక్‌బస్టర్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.. ఈ నేపథ్యంలో టాక్ తో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులకు అందించారంటూ నిర్మాతలు, దర్శకుడిని ప్రశంసించారు చరణ్.

Uppena Team

మెగా ఫ్యామిలీ ‘ఉప్పెన’
అలాగే మెగా ఫ్యామిలీ మెంబర్స్ ‘ఉప్పెన’ మూవీ ప్రత్యేక ప్రదర్శన వీక్షించారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, నిహారిక, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్, వైష్ణవ్ తేజ్, దర్శకుడు బుచ్చిబాబుతో సహా పలువురు మెగా కుటుంబ సభ్యులు సినిమా చూసి వైష్ణవ్‌ని, బుచ్చిబాబుని అభినందించారు.

Mega Family

స్టైలిష్ ‘లైగర్’
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో.. ధర్మా ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ.. ‘లైగర్’.. ‘సాలా క్రాస్ బీడ్’.. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ షూటింగ్ పున:ప్రారంభం కానుంది. షూటింగ్‌లో పాల్గొనడానికి విజయ్ స్పెషల్ ఫ్లైట్‌లో బాంబే బయలుదేరాడు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Vijay Deverakonda

Vijay Deverakonda

Vijay Deverakonda