మహేష్ మై బిగ్ బ్రదర్.. నాది కూడా సేమ్ ఫీలింగ్ బ్రదర్..

Mahesh Babu – Ranveer Singh: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు కమర్షియల్స్‌లోనూ నటిస్తుంటారు. ఇప్పటికే పలు సక్సెస్‌ఫుల్ బ్రాండ్లకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. మహేష్ చేసిన యాడ్స్ లో థమ్స్ అప్ ప్రకటన ప్రత్యేకమని చెప్పాలి.
చెమటలు కక్కే ఎండలో చల్లటి శీతలపానీయం కోసం గుటకలు మింగుతూ సాహసాలు చేస్తూ దాహం తీర్చుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మహేష్ తాజా థమ్స్ అప్ యాడ్‌లో బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌వీర్ సింగ్ కూడా నటించాడు.
మహేష్‌తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉందంటూ రణ్‌వీర్ చెప్పాడు. అంతేకాదు మహేష్‌ని ‘బిగ్ బ్రదర్’ అని సంబోధిస్తూ.. మహేష్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు రణ్‌వీర్.
నాదీ సేమ్ ఫీలింగ్ బ్రదర్..
రణ్‌వీర్ సింగ్ తనతో వర్క్ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేయడంతో మహేష్ రిప్లై ఇచ్చారు. ‘నీతో కలిసి పనిచెయ్యడం గ్రేట్ బ్రదర్.. ఇద్దరిదీ సేమ్ ఫీలింగ్’.. అంటూ మహేష్ బాబు తన ఇన్‌స్టాలో స్టోరీ షేర్ చేశారు.