IPL 2021: కోహ్లీ డిమాండ్.. సాఫ్ట్ సిగ్నల్ నిబంధన ఎత్తేసిన బీసీసీఐ

IPL 2021: కోహ్లీ డిమాండ్.. సాఫ్ట్ సిగ్నల్ నిబంధన ఎత్తేసిన బీసీసీఐ

Reports Bcci Removes Soft Signal From Ipl 2021

Updated On : March 28, 2021 / 1:22 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021) 14వ సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. కేవలం 12 రోజుల్లో ఈ సీజన్ మొదటి మ్యాచ్ ఏప్రిల్ 9 న చెన్నైలో జరుగబోతుంది. ఈ క్రమంలోనే భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఐపీఎల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఐపిఎల్‌లో సాఫ్ట్ సిగ్నల్ నియమాన్ని తొలగించింది. సాఫ్ట్ సిగ్నల్ నిర్ణయాలు మ్యాచ్ ధోరణిని మార్చగలవు కాబట్టి ఈ నిబంధనను తొలగించాలని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంతకుముందే డిమాండ్ చేశాడు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.

ఈ నిర్ణయంతో ఐపీఎల్‌లో ఇకపై సాఫ్ట్ సిగ్నల్ నియమాలు ఉండవు. థార్డ్ అంపైర్‌కు నిర్ణయాన్ని సూచించే ముందు మైదానంలో అంపైర్‌కు సాఫ్ట్ సిగ్నల్ పంపే అధికారం ఉండదని బిసిసిఐ నిర్ణయించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ 20 మ్యాచ్‌లో నాల్గవ టీ20లో సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయినప్పుడు ఈ వివాదం కనిపించింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్ రెండవ బంతికి డేవిడ్ మలన్ బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ పట్టుకోగా.. రీప్లేలో బాల్ మైదానాన్ని తాకినట్లు అనిపించింది.

రీప్లేలను చాలాసార్లు చూసిన తరువాత, థార్డ్ అంపైర్ ఆన్-ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్థించాడు. సాఫ్ట్ సిగ్నల్ కారణంగా ఇదంతా జరిగిందనేది శిశ్లేషకుల అభిప్రాయం కూడా. దీనిపై వీరేందర్ సెహ్వాగ్, వివిఎస్ లక్ష్మణ్ మరియు వసీం జాఫర్ వంటివారు తీవ్ర విమర్శలు చేశారు. ఐసిసి నిబంధనలను మార్చాల్సిన అవసరం ఉందని లక్ష్మణ్ అన్నారు. ఈ క్రమంలో బీసీసీఐ ఐపీఎల్‍‌లో ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ సైతం దాన్ని తొలగించాలని బహిరంగంగానే చెప్పాడు.