Plants cry when stressed
Plants cry when stressed : మనుష్యులం కాబట్టి మనకే అన్ని కష్టాలు, బాధలు అనుకుంటాం. ఒత్తిడి (stress), ఆందోళనకు గురవుతాం. ఒక్కోసారి తట్టుకోలేక విపరీతంగా ఏడ్చేస్తాం. ఈ ఒత్తిడి మనుష్యులకే కాదు మొక్కల్లో కూడా ఉంటుందట. అవునా? అని ఆశ్చర్యపోకండి. నిజమే. వాటికి ఏం సమస్యలు ఉంటాయి? అనుకున్నా ఇది నిజం. అయితే అవి చేసే శబ్దాలు మనకి వినపడవు. ఈ విషయాన్ని తాజాగా టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం (Tel Aviv University ) తమ పరిశోధనలో వెల్లడించింది.
మొక్కలంటే చాలామందికి ఇష్టం. ఇంట్లో పెంచుకునే క్రమంలో వాటితో అనుబంధం ఏర్పడుతుంది. అవి తలలు ఊపుతున్నట్లు, తమతో మాట్లాడుతున్నట్లు చాలామంది ఫీల్ అవుతారు. అయితే మొక్కలు కూడా స్పందిస్తాయట. రకరకాల శబ్దాలను రిలీజ్ చేస్తాయట. విపరీతమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు మొక్కలు అల్ట్రాసోనిక్ శబ్దాలను (ultrasonic sounds) విడుదల చేస్తాయట. అయితే అవి మనుష్యులకు ఏ మాత్రం వినపడవట. ప్రత్యేకంగా అమర్చిన మైక్రో ఫోన్ల (microphones)ద్వారా మాత్రమే ఈ శబ్దాలను గుర్తిస్తారట. మొక్కలు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడంతో పాటు తమను కాపాడమంటూ కూడా అరుస్తాయట. ఈ విషయాన్ని టెల్ అవీల్ విశ్వవిద్యాలయం తాము చేసిన పరిశోధనలో వెల్లడించింది. అల్ట్రాసోనిక్ మైక్రోఫోన్‌లు 20 నుండి 250 kHz వరకు ఫ్రీక్వెన్సీలపై మొక్కల అరుపులను రికార్డు చేసారట. AI అల్గారిథమ్‌ల (algorithms) దీన్ని విశ్లేషించగా మొక్కలు ఏడుస్తాయని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు.
UK pour Moi : భారతీయ మహిళలే ప్రపంచంలో అత్యంత అందమైనవారట .. అధ్యయనంలో వెల్లడి
వీరి పరిశోధన ప్రకారం టొమాటో (tomato), పొగాకు (tobacco) వంటి మొక్కలు కత్తిరించినప్పుడు లేదా డీహైడ్రేట్ (dehydrate) చేసినపుడు ఏడుస్తాయట. అయితే ఈ శబ్దాలు మనుష్యులకు ఏ మాత్రం వినపడే అవకాశం లేదు. గబ్బిలాలు (owls), ఎలుకలు (rat) లాంటి జంతువులకు మాత్రమే మొక్కల ఏడుపు వినిపిస్తుందని ఈ అధ్యయనం చెబుతోంది. దీన్ని బట్టి ఒత్తిడి అనేది మొక్కల్లో కూడా ఉంటుందని స్పష్టమవుతోంది.
A groundbreaking TAU study found that #plants emit sounds, especially when in distress, at frequencies too high for us to hear. #AI was used to distinguish different plants’ #stresscall. https://t.co/2KTmjawdTT@TauPlantSci @CellPressNews @of_sagol pic.twitter.com/PkGSRDhnob
— Tel Aviv University (@TelAvivUni) March 31, 2023