UK pour Moi :  భారతీయ మహిళలే ప్రపంచంలో అత్యంత అందమైనవారట .. అధ్యయనంలో వెల్లడి

ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలు భారతీయులేనని ఓ అధ్యయనం వెల్లడించింది.ప్రపంచంలోని 50 దేశాలకు చెందిన వ్యక్తుల భౌతిక రూపాన్ని బ్రిటీష్ కంపెనీ "పోర్ మోయ్"(pour moi) పోల్చింది. ఈ పోలిక ప్రకారం భారతీయ మహిళలు అత్యంత ఆకర్షణీయంగా కనిపించారని తేల్చింది. ఇక పురుషుల విషయానికొస్తే అందంలో బ్రిటన్ పురుషులు రెండస్థానంలో నిలిచారు.

UK pour Moi :  భారతీయ మహిళలే ప్రపంచంలో అత్యంత అందమైనవారట .. అధ్యయనంలో వెల్లడి

uk pour moi inidian womens most beautiful

UK pour Moi :  ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలు భారతీయులేనని ఓ అధ్యయనం వెల్లడించింది.గ్రేట్ బ్రిటన్ కు చెందిన మల్టీనేషనల్ టెక్స్ టైల్స్ కంపెనీ అయని “పోర్ మోయ్”(pour moi) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా.. ప్రముఖ సోషల్ మీడియా యాప్ రెడ్డిట్ లో గతేడాది అప్ లోడ్ చేసిన ఫొటోలను పరిగణలోకి తీసుకుని ఓ అధ్యయనం చేసింది. ఆన్ లైన్ అధ్యయాన్ని నిర్వహించి..ఈ నివేదికను రూపొందించటానికి కృత్రిమ మేథస్సు (Artificial Intelligence)సహాయంతో విశ్లేషించింది. ప్రపంచంలోని 50 దేశాలకు చెందిన వ్యక్తుల భౌతిక రూపాన్ని బ్రిటీష్ కంపెనీ “పోర్ మోయ్”(pour moi) పోల్చింది. ఈ పోలిక ప్రకారం భారతీయ మహిళలు అత్యంత ఆకర్షణీయంగా కనిపించారని తేల్చింది. ఇక పురుషుల విషయానికొస్తే అందంలో బ్రిటన్ పురుషులు రెండస్థానంలో నిలిచారు.

“పోర్ మోయ్”(pour moi) అధ్యయనం ప్రపంచంలోకెల్లా అందమైన మహిళలు, అందమైన పురుషులు ఏయే దేశాల్లో ఉన్నారో పేర్కొంటూ ఒక్కో దేశానికి ఒక్కో ర్యాంక్ కేటాయించింది. భారతీయ మహిళలు ప్రపంచంలో అత్యంత అందమైన మహిళ అని తేల్చగా .. బ్రిటన్ అందమైన పురుషులు రెండో స్థానంలో ఉన్నారని తెలిపింది.50 దేశాల అందాల జాబితాలో బ్రిటన్ ప్రజలు 12 స్థానంలో ఉన్నారని తెలిపింది. అలాగే చైనా ప్రజలు 16 స్థానంలో ఉండగా పాకిస్థాన్ ప్రజలు 23 వ స్థానంలో ఉన్నారని “పోర్ మోయ్”(pour moi) తెలిపింది.

`పోర్ మోయ్` సంస్థ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా వివిధ దేశాల మ‌హిళ‌లు, పురుషుల చిత్రాల‌తో కూడిన పోస్టులు..వాటిలోని అట్రాక్టివ్, బ్యూటిఫుల్, హ్యాండ్ సమ్, ప్రిట్టీ, గుడ్ లుకింగ్, గార్జియస్ వంటి కామెంట్లను ఆ పోస్టులకు, ఫోటోలకు వచ్చిన అప్ ోట్ లను పరిగణిలోకి తీసుకుని అధ్యయనం చేసింది. వాటి ఆధారంగానే ఆయా దేశాల ప్రజలకు ర్యాంకులు ఇచ్చింది. దాంట్లో భారతీయ మహిళలు టాప్ ప్లేస్ లో నిలిచారు. బ్రిటన్ పురుషులు రెండో స్థానంలో ఉండగా భారతీయ పురుషులకు రెండోస్థానం దక్కింది. అలాగే మ‌హిళ‌ల విభాగంలో జ‌పాన్‌, స్వీడ‌న్ దేశాల మ‌హిళ‌లు రెండు, మూడు స్థానాల్లో ఉండగా..ఆ తరువాత స్థానాల్లో వరుసగా పోలాండ్, ఇటలీ, బ్రెజిల్, యుక్రెయిన్,ఫ్రాన్స్, ఇజ్రాయిల్, అమెరికా వారు నిలిచారు. ఇక పురుషుల విభాగంలో దగ్రేట్ బ్రిటన్ నిలువగా రెండోస్థానంలో భార‌త్ పురుషులు నిలిచారు. ఆ తరువాత స్థానాల్లో ఇటలీ,యూఎస్, స్వీడన్, జపాన్, ఫ్రాన్స్, ఐర్లాండ్ దేశాలున్నాయి.

దీని గురించి పోర్ మోయ్ ప్రతినిధి మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంజెలిజెన్స్ ద్వారా Reddit డేటాను విశ్లేషించి..ప్రపంచంలోని ఇతర దేశాల నుండి ప్రజలు ఏయే దేశాలకు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నారో మేము కనుగొన్నామని తెలిపారు. దీంట్లో భారతీయులు అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తులు అని తేలింది అని తెలిపారు.