first plant fungus case : కోల్‌కతాలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్రాణంతక “ప్లాంట్ ఫంగస్” కేసు.. ఇది ఎలా సంక్రమిస్తుందంటే …

కరోనా ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది. మరోవైపు కొత్త వైరస్‌లు భయపెడుతున్నాయి. తాజాగా కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి 'ప్లాంట్ ఫంగస్' బారిన పడ్డాడు. ప్రపంచంలోనే ఈ ఫంగస్ సోకిన మొదటి కేసు కోల్‌కతాలో నమోదైంది.

first plant fungus case : కోల్‌కతాలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్రాణంతక “ప్లాంట్ ఫంగస్” కేసు.. ఇది ఎలా సంక్రమిస్తుందంటే …

first plant fungus case

first plant fungus case : ఓవైపు కోవిడ్ (covid) ఇంకా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. దాని వెనుక ఇప్పుడు రకరకాల వైరస్‌లు (virus) బయలుదేరి మరింతగా భయపెడుతున్నాయి. తాజాగా కోల్‌కతాకు (Kolkata) చెందిన ఓ వ్యక్తి ఫ్రాంతాంతక  ‘ప్లాంట్ ఫంగస్’ (plant fungus) బారిన పడ్డాడు. మొక్కల నుంచి ఈ ఫంగస్ సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రపంచంలోనే మొదటిసారిగా కోల్‌కతాలో ఈ ఫంగస్ సోకిన కేసు నమోదైంది.

కొత్త వైరస్.. సోకిన 24గంటల్లోనే మరణం

‘ప్లాంట్ ఫంగస్’ బారిన పడిన కోల్ కత్తాకు చెందిన 61 సంవత్సరాల వ్యక్తి ప్లాంట్ మైకాలజిస్ట్‌గా (plant mycologist) ఉన్నాడు. ఇతను కొంతకాలంగా కుళ్లిన మొక్కలు, పుట్టగొడుగులతో (mushroom) పాటు పలు రకాల మొక్కల శిలీంద్రాలతో పనిచేస్తున్నాడట. ఇంతకు ముందు ఇతనికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. అయితే గత కొంతకాలంగా దగ్గు (cough), గొంతు నొప్పి, ఏది తిన్నా గొంతు దిగకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడట. ఈ సమస్యలతో కోల్‌కతాలోని అపోలో వైద్యుల్ని కలిశాడు. అతనికి ఎక్స్ రే (X-ray) CT స్కాన్‌లు ( CT scan) సూచించిన వైద్యులు ఆ రిపోర్ట్స్ పరిశీలించగా ఎక్స్‌రేలో ఎటువంటి సమస్య కనిపించలేదు. CT స్కాన్‌లో మాత్రం మెడ భాగంలో పారాట్రాషియల్ చీము (paratracheal abscess ) కనిపించిందట. వెంటనే దానిని క్లియర్ చేసిన వైద్యులు ఆ తరువాత జరిపిన పరీక్షల్లో అతనికి కొండ్రోస్టెరియం పర్పురియం (Chondrostereum purpureum) ఉన్నట్లుగా గుర్తించారు.

H3N2 Influenza Virus : మళ్లీ మాస్క్ తప్పదా? కరోనా కంటే వేగంగా వ్యాపిస్తూ భయపెడుతున్న కొత్త వైరస్, డాక్టర్లు ఏం చెబుతున్నారు?

ఇంతకీ ఈ కొండ్రోస్టెరియం పర్పురియం అనేది కార్టిసియాసికి (Corticiaceae) చెందిన ఫంగస్ జాతి అట.. దీనినే “వైలెట్ ఫంగస్” (violet fungus) అంటారట.. ఇది మనుష్యుల్లో ఇన్ ఫెక్షన్ సోకడానికి కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. కుళ్లిన కలప, మొక్కల పదార్ధాలు కలిసిన నేలలో పనిచేయడం, మొక్కల శిలీంద్రాలతో పనిచేస్తున్నప్పుడు కూడా ఈ ఫంగస్ వ్యాప్తి చెందుతుందట. అలా మొక్కలతో పనిచేస్తున్నక్రమంలోనే ఈ ప్రమాదకరమైన ఇన్ ఫెక్షన్ కి గురయ్యాడు సదరు వ్యక్తి.

Debina Bonnerjee : బుల్లితెర నటికి అరుదైన వైరస్.. ముందు పట్టించుకోలేదు.. ఇప్పుడేమో..

అయితే యాంటీ ఫంగల్ మందులతో (antifungal medications) చికిత్స చేయడం ద్వారా అతని ప్రాణాలు కాపాడారు వైద్యులు. డాక్టర్ల పర్యవేక్షణలో రెండు సంవత్సరాలు పూర్తి చికిత్స అందుకున్న తరువాత అతను తిరిగి కోలుకున్నాడు. ఏదీ ఏమైనా మొక్కల మధ్యలో పనిచేసే వారు కూడా కాస్త జాగ్రత్త వహించాలని ఈ స్టోరిని బట్టి అర్ధమవుతోంది.