Kanpur Police
Police adventure : పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించడమే కాదు.. అవసరమైతే తమ ప్రాణాలకు తెగించి కూడా కాపాడతారు. తాజాగా ఓ పోలీస్ అధికారి అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న కుటుంబాన్ని రక్షించడం కోసం సాహసం చేశారు.
కాన్పూర్ బాద్షాహీ నాకాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా భవనం మొత్తం వ్యాపించాయి. చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం ఇచ్చారు. ఈ ఘటనలో మూడవ అంతస్తులో ఉన్న ఫ్యామిలీ మంటల్లో చిక్కుకున్నట్లు అంతా భావించారు.
పోలీస్ అధికారి అంకిత్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ కుటుంబాన్ని రక్షించడానికి ముందుకు వెళ్లారు. మంటలు వ్యాపించిన మూడో అంతస్తులోని కిటికీ అద్దాలను పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఆయన ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మంటల్లో చిక్కుకునేవారు. అయినా సరే పట్టు వదలకుండా కిటికీ అద్దాలు పగులగొట్టి లోనికి వెళ్లాక అక్కడ ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Assam Police : అస్సాం పోలీసులు షేర్ చేసిన ఫోటో వెనుక ఇంత అర్ధం ఉందా?
పోలీస్ అధికారి అంకిత్ చేసిన సాహసాన్ని కొందరు వీడియో తీశారు. @upkhabariya అనే ట్విట్టర్ యూజర్ దీనిని పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కుటుంబం ప్రాణాలు కాపాడటానికి పోలీసు అధికారి చేసిన సాహసాన్ని మెచ్చుకుంటున్నారు.
आग के दौरान दारोगा का तीसरी मंजिल में चढ़ कर खिड़की तोड़ने का विडियो हुआ वायरल
साहसिक कार्य करने में पुलिस
कमिश्नर ने दरोगा को 25 हज़ार का इनाम देने की घोषणाबादशाही नाका की लोहा मंडी चौकी में तैनात है दरोगा अंकित खटाना।
#ankitkhatana #UPPolice #kanpurpolice pic.twitter.com/0e7PHvbATE— UP Khabariya (@upkhabariya) May 17, 2023