Mumbai Police : వర్షంలో బైక్ స్కిడ్ అవ్వకుండా ఈ పోలీస్ చేసిన పని చూడండి.. ముంబై పోలీస్‌పై ప్రశంసల వర్షం..

భారీ వర్షాల కారణంగా దేశ వ్యాప్తంగా అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముంబయిలో ఈరోజు కురిసిన వర్షం కారణంగా రోడ్డుపై బైక్‌లు జారి పడ్డాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే చూడలేకపోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏం చేశారంటే..

Mumbai Police : వర్షంలో బైక్ స్కిడ్ అవ్వకుండా ఈ పోలీస్ చేసిన పని చూడండి.. ముంబై పోలీస్‌పై ప్రశంసల వర్షం..

Mumbai Police

Mumbai Police :  భారీ వర్షం తర్వాత కొన్ని రోడ్లపై వాహనాలు స్కిడ్ అవుతుంటాయి. ప్రమాదానికి గురవుతుంటాయి. అలాంటి సమయాల్లో రోడ్డుపై జారకుండా కంకర లేదా మట్టిని వేస్తుంటారు. ముంబయిలో ఇలాంటి పరిస్థితి ఎదురైనపుడు ట్రాఫిక్ పోలీస్ చేసిన మంచి పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Mumbai Police : ఫ్లై ఓవర్‌పై నిలిచిపోయిన బస్సు.. డ్రైవర్‌కి సాయం చేసిన ప్యాసింజర్లు.. ముంబయి పోలీసులు షేర్ చేసిన వీడియో వైరల్

ఈసారి వేసవి కాలం ఎండల ప్రతాపంతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వర్షాల కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారులు దెబ్బతినడం.. రోడ్లపై వాహనాలు జారి పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ముంబయిలో కూడా ఈరోజు ఇదే పరిస్థితి ఎదురైంది.

 

భాండప్ పంపింగ్ సిగ్నల్ దగ్గర భారీ వర్షంతో చాలామంది బైక్‌ల మీద నుంచి జారి పడ్డారు. అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. వాళ్లు వచ్చేంతవరకూ ఆయన వేచి చూడలేదు. వాహనదారుల భద్రత కోసం స్వయంగా ఆయనే రోడ్డుపై మట్టిని చల్లారు. @ParmarVaibhav7 అనే ట్విట్టర్ యూజర్ ద్వారా ఆయన మట్టిని చల్లుతున్న ఫోటో షేర్ చేసారు.

dancing cop : హీరోల్ని మించి స్టెప్పులు ఇరగదీస్తున్న ముంబయి పోలీస్ వీడియో వైరల్

ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘బాధ్యత గల పోలీస్’ అంటూ నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎండల్లో, వానల్లో సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్‌ని కంట్రోల్ చేస్తూనే.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనిచేస్తున్న ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్‌కి సెల్యూట్ చేయాల్సిందే.