Rk Roja Breaks Down In Tears On Jabardasth Show
RK Roja: ఇటీవల ఏపీ కేబినెట్‌లో మంత్రిగా పదవి దక్కించుకున్నారు నగరి ఎమ్మెల్యే ఆర్కె రోజా. సీఎం జగన్ కేబినెట్‌లో పర్యాటక శాఖ మంత్రిగా రోజా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే మంత్రిగా పదవి దక్కడంతో, తాను ఇకపై టీవీ షోలు, సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు రోజా పేర్కొన్నారు. అయితే ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే జబర్దస్త్ కామెడీ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా తాజాగా ఈ షో నుండి బయటకు వచ్చేశారు. దీనికి సంబంధించిన తాజా ఎపిసోడ్‌లో ఆర్కె రోజాకు జబర్దస్త్ టీమ్ వీడ్కోలు చెప్పారు.
Roja : మంత్రి పదవి రావడంతో రోజా కీలక నిర్ణయం.. సినిమాలకి, జబర్దస్త్‌కి రోజా గుడ్‌బై..
ఏపీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజాకు జబర్దస్త్ టీమ్ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే 13 ఏళ్లుగా జబర్దస్త్ కామెడీ షోతో తనకున్న అనుబంధం గురించి రోజా ఈ సందర్బంగా గుర్తుకు చేసుకున్నారు. తాను జబర్దస్త్ షోలో ఉండగా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించానని.. మంత్రి కూడా అయ్యానంటూ రోజా చెప్పుకొచ్చింది. తనకు ప్రజాసేవ చేయడం చాలా ఇష్టమని.. తనను నమ్మి ఇలాంటి బాధ్యతను తనకు అప్పగించడంతో సంతోషంగా ఉందని రోజా తెలిపారు. అయితే ప్రజాసేవ కోసం తనకు ఇష్టమైనవి కొన్ని వదులుకోవాల్సి వస్తుందని ఆమె ఎమోషనల్ అయ్యారు.
తనకు ఇంతకాలంగా సపోర్ట్ చేసిన జబర్దస్త్ షో నిర్వాహకులు, ఆర్టిస్టులు, మల్లెమాల యాజమాన్యానికి రోజా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రోజాకు ఘనంగా వీడ్కోలు పలికారు జబర్దస్త్ నిర్వాహకులు. తాము రోజాను తప్పక మిస్ అవుతామంటూ కంటెస్టెంట్స్ కూడా కంటతడి పెట్టుకున్నారు. ఇన్నేళ్లుగా తమకు మద్దతునిచ్చిన రోజాను ఎప్పటికీ మరచిపోలేమని వారు అన్నారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.