RK Roja : ‘జగన్ అన్న నమ్మకాన్ని నిలబెడతా’మంత్రిగా రోజా బాధ్యతల స్వీకరించిన రోజా..దిష్టి తీసిన భర్త సెల్వమణి..
మంత్రి పదవి దక్కించుకున్న ఆర్కే రోజు సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Rk Roja..took Over As Ap Tourism Minister
roja takes oath : మంత్రి పదవి దక్కించుకున్న ఆర్కే రోజు సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఏపీ పర్యాటక,సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త సెల్వమణి, కుమారుడు, కూతురు, ఇంకా వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు. రోజా బాధ్యతలు స్వీకరించేముందు ఆమెకు భర్త సెల్వమణి గుమ్మడికాయతో దిష్టి తీశారు. రోజా మంత్రి చాంబర్‌లోని చైర్‌లో కూర్చున్న అనంతరం ఆమెకు కూతురు ముద్దు పెట్టారు.బాధ్యతలు స్వీకరించిన రోజా గండికోట టూ బెంగళూరు బస్సు సర్వీసును ప్రారంభిస్తు తొలి సంతకం చేశారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ… తనపై సీఎం వైఎస్ జగన్ కు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకుంటానని తెలిపారు. ఏపీలో ఉన్న వనరులను ఉపయోగించి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. వైసీపీని స్థాపించకముందు నుంచే తాను జగన్ అడుగు జాడల్లో నడిచానని..ఏపీ మంత్రులుగా ఉన్న వాళ్లంతా జగన్ కు సైనికుల్లా పనిచేశారని అన్నారు.
జగన్ లాంటి గొప్ప నేతతో కలిసి నడవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. కాగా, మంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు సీఎం వైఎస్ జగన్‌ను రోజా కలిశారు. గండికోట నుంచి బెంగళూరుకు టూరు కోసం మొదటి బస్సు విషయంపై తొలి సంతకం చేసినట్టు చెప్పారు.