RRR: రేపు కాదు.. ఇవాళ ఏడింటికే!

‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Rrr Pre Pones Etthara Jenda Song

RRR: ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ‘ఎత్తర జెండా’ అనే పాటను రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన యూనిట్, కొన్ని సాంకేతిక కారణాల వల్ల సాంగ్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఇక రేపు ఉదయం 10 గంటలకు ఈ పాటను రిలీజ్ చేస్తామని వారు ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే మరో ట్విస్ట్ ఇచ్చింది ఆర్ఆర్ఆర్ టీమ్.

‘ఎత్తర జెండా’ సాంగ్‌కు సంబంధించిన వీడియో రెడీగా ఉందని, రేపటి వరకు ప్రేక్షకులను వెయిట్ చేయించడం కరెక్ట్ కాదని భావించి, ఈ సాంగ్ వీడియోను ఇవాళ సాయంత్రం 7 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈ మేరకు తమ సోషల్ మీడియా అకౌంట్‌లో దీనికి సంబంధించిన పోస్ట్ పెట్టారు చిత్ర యూనిట్. ఇలా పాట విడుదలకు సంబంధించి ఇన్నిసార్లు టైం మార్చడం ఏమిటని అభిమానులు మండిపడుతున్నారు. అయితే ఏదేమైనా తమ అభిమాన సినిమా నుండి ఓ అప్‌డేట్ రానుండటంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

RRR: ఎన్టీఆర్-చరణ్ పట్టిన జెండా కథ ఏంటో తెలుసా..?

ఇక ఈ పాటకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే ఆడియెన్స్‌లో మంచి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేసింది. ఈ పాటలో ఇద్దరు హీరోలు కూడా అదిరిపోయే స్టెప్పులు వేస్తారని, ఈ పాట చూసేందుకు రెండు కళ్లు చాలవని చిత్ర యూనిట్ అంటోంది. దీంతో ఈ పాటపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ సినిమాకు ఈ పాట ప్రాణంలా ఉంటుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

RRR: ఆకాశమే హద్దుగా తారక్ మాసివ్ క్రేజ్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా, డివివి.దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన చిత్ర యూనిట్, మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్‌ను ప్లాన్ చేసింది.