Kerala Budget: కరోనా కట్టడికి రూ.20 వేల కోట్లు.. వ్యాక్సిన్ కోసం అదనంగా రూ.1500 కోట్లు!
మన దేశంలో కరోనా తొలిదశలో భయం అధికంగా ఉన్నా ప్రాణనష్టం మాత్రం కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది. కానీ కరోనా రెండో దశలో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేకుండా దేశం మొత్తాన్ని హడలెత్తించింది. ఇప్పటికీ మహమ్మారి విషాదం నుండి చాలా రాష్ట్రాలు కోలుకోలేకపోతున్నాయి.

Kerala Budget
Kerala Govt: మన దేశంలో కరోనా తొలిదశలో భయం అధికంగా ఉన్నా ప్రాణనష్టం మాత్రం కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది. కానీ కరోనా రెండో దశలో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేకుండా దేశం మొత్తాన్ని హడలెత్తించింది. ఇప్పటికీ మహమ్మారి విషాదం నుండి చాలా రాష్ట్రాలు కోలుకోలేకపోతున్నాయి. ఇప్పటికీ చాలా రాష్ట్రాలలో కరోనా కేసుల సంఖ్య హడలెత్తిస్తూనే ఉంది. అందులో కేరళ రాష్ట్రం కూడా ఉంది. గత ఏడాది మన దేశంలో తొలికేసు నమోదైన రాష్ట్రం నుండి కట్టడిలో కూడా తొలిరాష్ట్రంగానే పేరుతెచ్చుకుంది. కానీ ఇక్కడ కూడా సెకండ్ వేవ్ వ్యాప్తి ఉధృతంగానే కొనసాగింది.
దీంతో వైరస్ వ్యాప్తి కట్టడికి ఇక్కడి ప్రభుత్వం ఒకవైపు కఠిన ఆంక్షలు విధిస్తూనే మరోవైపు భారీ బడ్జెట్ కేటాయించింది. శుక్రవారం ఈ ఏడాది కేరళ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. అందరికీ ఆహారం, ఆరోగ్యమే కొత్త బడ్జెట్ లక్ష్యంగా పేర్కొన్న కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ కరోనా కట్టడికి రూ.20 వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లుగా పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కోసం మరో రూ.1500 కోట్లు అదనంగా కేటాయించినట్లుగా వెల్లడించారు.
ముందుగా రెండోదశలో వ్యాప్తి ఉదృతంగా ఉన్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కొనేందుకు కేరళ ప్రభుత్వం రూ.20వేల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించగా ఇందుకు అదనంగా ఉచిత వ్యాక్సినేషన్ కోసం రూ.1000 కోట్లు, వ్యాక్సినేషన్ కు సంబంధించిన వసతుల ఏర్పాటుకు మరో రూ.500 కోట్లు కేటాయించింది. వైరస్ కట్టడి చేసి రాష్ట్రంలో మూడో దశ ఏర్పడకుండా చర్యలు చేపడతామని ప్రభుత్వం ధీమాగా చెప్తుంది.