V Jayaram : కరోనాతో సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కన్నుమూత..

సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కరోనాతో కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందుతూనే గురువారం రాత్రి కన్నుమూశారు..

V Jayaram : కరోనాతో సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కన్నుమూత..

Senior Cinematographer V Jayaram Passes Away

Updated On : May 21, 2021 / 10:27 AM IST

V. Jayaram: సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కరోనాతో కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందుతూనే గురువారం రాత్రి కన్నుమూశారు. అటు మలయాళం, ఇటు తెలుగు సినిమా రంగంలోనూ సినిమాటోగ్రాఫర్‌గా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారాయన.

తెలుగులో నందమూరి తారక రామారావు, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకూ, మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి అగ్ర హీరోల సినిమాలకూ ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి మంచి గుర్తింపు తెచుకున్నారు.

కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు ఆయన కెమెరా మెన్‌గా పని చేశారు. ఆయన సినిమాటోగ్రఫీలోనే ‘పెళ్లి సందడి’ చిత్రం రూపొందింది. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య రెండు సంవత్సరాల క్రితం కాలం చేశారు.