Shahid Kapoor: మరో తెలుగు సినిమాపై పడ్డ రీమేక్ స్టార్..?

ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలు అన్నా, తెలుగు స్టార్స్ అన్నా, బాలీవుడ్ జనాల్లో చిన్నచూపు ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు వస్తున్న సినిమాలు,.....

Shahid Kapoor Eyes On Shyam Singha Roy Hindi Remake

Shahid Kapoor: ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలు అన్నా, తెలుగు స్టార్స్ అన్నా, బాలీవుడ్ జనాల్లో చిన్నచూపు ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు వస్తున్న సినిమాలు, వాటి సక్సెస్, క్రేజ్‌ను చూసి బాలీవుడ్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. అంతేగాక తెలుగు సినిమాలను వరుసగా రీమేక్ చేస్తూ బాలీవుడ్ హీరోలు బ్లాక్‌‌బస్టర్ విజయాలను తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్‌‌పైనే ఫోకస్ పెట్టాడు. ఇక్కడ కంటెంట్‌తో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్న సినిమాలను వరుసగా టార్గెట్ చేస్తూ రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Shahid Kapoor : నాని యాక్టింగ్ చూసి ఏడ్చేశా..

విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేసి షాహిద్ కపూర్ బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తరువాత నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ చిత్రాన్ని కూడా రీమేక్ చేసి రిలీజ్‌కు రెడీ చేశాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయగా, దానికి బాలీవుడ్‌లో అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపడం ఖాయమని బాలీవుడ్ వర్గాలు పూర్తి ధీమాగా ఉన్నాయి. అయితే ఇప్పుడు షాహిద్ కపూర్ మరో తెలుగు సినిమాపై మనసు పడినట్లు తెలుస్తోంది.

ఈసారి కూడా నాని నటించిన సినిమానే టార్గెట్ చేశాడట ఈ రీమేక్ స్టార్. నాని డ్యుయెల్ రోల్‌లో నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం టాలీవుడ్‌లో అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది. ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేయాలని షాహిద్ కపూర్ భావిస్తున్నాడట. ఇక ఈ మేరకు ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టాడట ఈ హీరో. కాగా ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించిన అందాల భామ కృతి శెట్టినే బాలీవుడ్‌లోనూ కంటిన్యూ చేయాలని షాహిద్ కపూర్ ట్రై చేస్తున్నాడట.

Jersey Movie : షాహిద్ కపూర్ ‘జెర్సీ’ విడుదల వాయిదా..

ఏదేమైనా తెలుగునాట భారీ విజయాలను అందుకున్న చిత్రాలను వరుసబెట్టి రీమేక్ చేస్తూ సందడి చేస్తున్న షాహిద్ కపూర్, ఇప్పుడు జెర్సీ సినిమాతో మరో హిట్ కొట్టేందుకు రెడీగా ఉన్నాడు. మరి ఈ హీరో నిజంగానే శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని కూడా బాలీవుడ్‌లో రీమేక్ చేసి వదులుతాడా లేక ఈ వార్త కూడా మిగతావాటిలా కేవలం పుకారుగానే మిగులుతుందా అనేది చూడాలి.