Shahid Kapoor : నాని యాక్టింగ్ చూసి ఏడ్చేశా..

తెలుగు ‘జెర్సీ’ లో నాని యాక్టింగ్ చూసి నాలుగైదు సార్లు ఏడ్చేశానని షాహిద్ కపూర్ చెప్పారు..

Shahid Kapoor : నాని యాక్టింగ్ చూసి ఏడ్చేశా..

Shahid Kapoor About Jersey Movie

Updated On : June 24, 2021 / 7:43 PM IST

Shahid Kapoor: ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ తర్వాత షాహిద్ కపూర్ మరో టాలీవుడ్ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. నేచురల్ స్టార్ నాని నటించిన ఎమోషనల్ ఫిలిం ‘జెర్సీ’ మూవీని అల్లు అరవింద్ – దిల్ రాజుతో పాటు బాలీవుడ్ స్టార్ మేకర్ అమిన్ గిల్ కలిసి హిందీలో నిర్మిస్తున్నారు..

ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించిన యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హిందీ వెర్షన్‌ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. షాహిద్ ‘జెర్సీ’ లో క్యారెక్టర్ కోసం చాలా బాగా మేకోవర్ అయ్యాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘జెర్సీ’ మూవీ త్వరలో రిలీజ్ కానుంది.

Jersey

తెలుగు ‘జెర్సీ’ లో నాని యాక్టింగ్ చూసి నాలుగైదు సార్లు ఏడ్చేశానని షాహిద్ కపూర్ చెప్పారు. నాని నేచురల్ పర్ఫార్మెన్స్ అద్భుతం అని ప్రశంసించారు. ‘జెర్సీ’ కథ నా పర్సనల్ లైఫ్‌కి చాలా దగ్గరగా ఉంది.. ఎందుకంటే నా వయసు 40 ఏళ్లు.. జీవితంలో లేట్‌గా సక్సెస్ వస్తే ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు.. అందుకే ‘జెర్సీ’ మూవీ నా మనసుకు బాగా దగ్గరైంది’ అని చెప్పుకొచ్చారు షాహిద్.