Jersey Movie : షాహిద్ కపూర్ ‘జెర్సీ’ విడుదల వాయిదా..

ప్రకటించిన తేదికి సినిమా విడుదల కావడం లేదని ‘జెర్సీ’ మేకర్స్ అనౌన్స్ చేశారు..

Jersey Movie : షాహిద్ కపూర్ ‘జెర్సీ’ విడుదల వాయిదా..

Jersey Movie

Updated On : December 28, 2021 / 3:52 PM IST

Jersey Movie: ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ తర్వాత షాహిద్ కపూర్ మరో టాలీవుడ్ సినిమా రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ మూవీని అదే పేరుతో అల్లు అరవింద్ సమర్పణలో.. నాగవంశీ – దిల్ రాజుతో పాటు బాలీవుడ్ స్టార్ మేకర్ అమిన్ గిల్ కలిసి నిర్మిస్తున్నారు.

Pushpa Thank You Meet : కంటతడి పెట్టించిన సుకుమార్.. లైట్ అండ్ సెట్ బాయ్స్‌కి లక్ష రూపాయలు ప్రకటన..

బన్నీవాసు సహ నిర్మాత. మృణాళిని ఠాకూర్ కథానాయికగా నటించగా.. తెలుగు ‘జెర్సీ’ డైరెక్ట్ చేసి వివర్శకుల ప్రశంసలందుకున్న గౌతమ్ తిన్ననూరి హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఆమీర్ ఖాన్‌తో హిందీలో ‘గజిని’ రూపొందించిన తర్వాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న సినిమా ఇదే.

Shyam Singha Roy : సత్తా చాటుతున్న ‘శ్యామ్‌ సింగ రాయ్‌’..

సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయ్యింది. బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఈ ఏడాదిలో చివరి రోజైన డిసెంబర్ 31న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ప్రకటించిన తేదికి సినిమా విడుదల కావడం లేదు, ప్రస్తుతం వాయిదా వేస్తున్నామని, త్వరలో కొత్త డేట్ అనౌన్స్ చేస్తామని ప్రకటించారు మేకర్స్.