Shilpa Shetty : పోర్న్ చిత్రాల కేసు… నటిపై రూ.50కోట్లకు పరువు నష్టం దావా

పోర్న్ వీడియోల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ కావడం బాలీవుడ్ లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవలే ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు.

Shilpa Shetty : పోర్న్ వీడియోల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ కావడం బాలీవుడ్ లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవలే ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. మరోవైపు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలు తనను బెదిరించారంటూ మరో బాలీవుడ్ నటి, మోడల్ షెర్లిన్ చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

రాజ్ కుంద్రా, శిల్ప తనపై లైంగిక దాడికి కూడా యత్నించారని ఆమె ఫిర్యాదులో తెలిపారు. తనని బెదిరించి తనపై అశ్లీల చిత్రాలను తెరకెక్కించినట్లు ఫోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రా జైలులో ఉన్న సమయంలో షెర్లిన్ చోప్రా ఆరోపించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రాజ్‌కుంద్రాపై కేసు పెట్టిన షెర్లిన్‌.. ఇటీవల సైతం రాజ్ కుంద్రా లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు, మోసం చేశారంటూ అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని పోలీసులను కోరింది.

WhatsApp self-chat: చిన్న ట్రిక్‌తో వాట్సప్‌లో సెల్ఫ్ మెసేజ్!

ఈ నేపథ్యంలో షెర్లిన్ పై శిల్ప, రాజ్ కుంద్రా న్యాయపరమైన చర్యలకు దిగారు. తమ పరువుకు భంగం కలిగించేలా వ్యహరించిందంటూ షెర్లిన్ పై రూ. 50 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. షెర్లిన్ చోప్రా చేసిన ఆరోపణలు అవాస్తవమైనవని, నిరూపించేందుకు ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని శిల్ప, రాజ్ తరపు న్యాయవాది చెప్పారు.

Free Wi-Fi: ఉచిత వైఫై వాడుతున్నారా? రిస్క్ చేస్తున్నట్లే.. తస్మాత్ జాగ్రత్త!!

వారిని కించపరిచి, డబ్బులు డిమాండ్ చేసేందుకే ఆమె ఆరోపణలు చేశారని తెలిపారు. వివాదాలు సృష్టించేందుకు, మీడియాని ఆకర్షించేందుకు ఇలా చేసిందన్నారు. షెర్లిన్ పై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామని అన్నారు. కాగా, అశ్లీల చిత్రాలు తెరకెక్కిస్తున్నారనే కారణంగా రాజ్‌కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు