WhatsApp self-chat: చిన్న ట్రిక్‌తో వాట్సప్‌లో సెల్ఫ్ మెసేజ్!

గ్లోబల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో సెల్ఫ్ మెసేజ్ చేసుకోవాలంటే, కొంచెం ట్రిక్ ఉపయోగిస్తే చాలు..

WhatsApp self-chat: చిన్న ట్రిక్‌తో వాట్సప్‌లో సెల్ఫ్ మెసేజ్!

WhatsApp self-chat

WhatsApp self-chat: గ్లోబల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో సెల్ఫ్ మెసేజ్ చేసుకోవాలంటే, కొంచెం ట్రిక్ ఉపయోగిస్తే చాలు.. ఈ విషయం మీకు తెలుసా? వాట్సాప్‌లో సెల్ఫ్ చాట్ ఫీచర్ అందుబాటులో ఉంది. ముఖ్యమైన సమాచారం పెట్టుకోవడానికి.. మీకు మీరే మెసేజ్ చేసుకోవచ్చు.

1) ముందుగా మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో బ్రౌజర్‌ను ఓపెన్ చెయ్యాలి. (Google Chrome, Mozilla Firefox, మరేదైనా).

2) అడ్రెస్ బాక్స్‌లో wa.me// అని టైప్ చేసి, ఆపై మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. తర్వాత మీ కంట్రీ కోడ్‌ ఎంటర్ చెయ్యండి. భారతీయ వినియోగదారులు తమ ఫోన్ నంబర్లను wa.me//91xxxxxxxxxx ఫార్మాట్‌లో టైప్ చేయవచ్చు.

3) మొబైల్‌లో వెంటనే వాట్సప్ ఓపెన్ అయిపోతుంది. డెస్క్ టాప్ బ్రౌజర్‌లో వాట్సప్ వెబ్ ఓపెన్ అవుతుంది. మీ నెంబర్‌తో వాట్సప్ చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో నచ్చిన ఫోటోలు, వీడియోలు, నోట్స్, మెసేజ్‌లు షేర్ చేసుకోవచ్చు.

పై మూడు స్టెప్‌లలో మీరు సులభంగా వాట్సప్‌లో సెల్ఫ్ మెసేజ్ చేసుకోవచ్చు.