Free Wi-Fi: ఉచిత వైఫై వాడుతున్నారా? రిస్క్ చేస్తున్నట్లే.. తస్మాత్ జాగ్రత్త!!

ఉచిత వైఫై(Free wifi) లేదా పబ్లిక్ వైఫైని ఉపయోగించడం ప్రమాదమని మీకు తెలుసా?

Free Wi-Fi: ఉచిత వైఫై వాడుతున్నారా? రిస్క్ చేస్తున్నట్లే.. తస్మాత్ జాగ్రత్త!!

Free Wifi

The risks of public Wi-Fi: ఉచిత వైఫై(Free wifi) లేదా పబ్లిక్ వైఫైని ఉపయోగించడం ప్రమాదమని మీకు తెలుసా? పబ్లిక్ వైఫై సెక్యూర్‌గా ఉంచితే, హ్యాకింగ్ ప్రమాదం తక్కువగా ఉంటుంది. అయితే, భారతదేశంలో డేటా, సైబర్ సెక్యురిటీకి సంబంధించిన వ్యవస్థ బలహీనంగా ఉంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఎక్కడైనా ఉచిత వైఫై లేదా పబ్లిక్ వైఫైని మీ ఫోన్‌తో యాక్సిస్ చెయ్యాలని అనుకుంటే మాత్రం కచ్చితంగా ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంటున్నారు.

ఫ్రీ వైఫైని వాడుతుంటే మాత్రం.. మీ మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకున్న సున్నితమైన డేటా తస్కరించే అవకాశం ఉంది. ఫ్రీ లేదా పబ్లిక్ వైఫైని ఉపయోగించడం ద్వారా, మీ మొబైల్‌లో సేవ్ చేసిన లాగిన్ వివరాలతో మీ బ్యాంక్‌‌లో డబ్బులు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. హ్యాకర్లు టార్గెట్‌గా చేసుకుని మీ స్మార్ట్‌ఫోన్‌ను ట్యాంపర్ చేయవచ్చు.

ప్రస్తుతం రైల్వే, బస్సులు, హోటళ్లు, మాల్స్‌, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఫ్రీగా వైఫై సౌకర్యం కనిపిస్తుంది. అక్కడి నెట్‌వర్క్‌కు చేరుకుని ఫ్రీగా ఇంటర్నెట్‌ యూజ్ చేసుకుంటున్నారు. అయితే, వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయ్యాక వారి మొబైల్ డాటా మొత్తం వైఫై సర్వర్‌కు చేరిపోతుందని, తద్వారా హ్యాకర్లు మన డేటాను దొంగలించేస్తున్నట్లు చెబుతున్నారు టెక్ నిపుణులు.

ఫ్రీ వైఫై నెట్‌వర్క్‌ యూజ్ చేసుకునే సమయంలో మొబైల్‌లో సైనప్ సెట్టింగ్ వస్తుంది. YES బటన్‌పై క్లిక్ చేయగానే మొబైల్ డాటా ఆటోమేటిక్‌గా సర్వర్‌కు కాపీ అయిపోతుంది. తద్వారా మనం మన డేటాను కొల్పోయే పరిస్థితి ఉంటుంది. పబ్లిక్ వైఫైలు సేఫ్ కాదని, పబ్లిక్ వైఫైని ఉపయోగించడం వల్ల వందలాది మంది ఇబ్బందులు పడ్డట్టు టెక్ నిపుణులు చెబుతున్నారు.

మ్యాన్ ఇన్ ది మిడిల్ అటాక్స్ ద్వారా, హ్యాకర్లు పబ్లిక్ వైఫైకి కనెక్ట్ చేయబడిన స్మార్ట్‌ఫోన్‌లు, ప్‌టాప్‌లను సులభంగా హ్యాక్ చేసుకుంటారు. మీ మొబైల్, హాట్ స్పాట్ మధ్య కనెక్షన్‌లో ప్రయాణించే డేటా ప్యాకెట్‌ల రూపంలో ఉంటుంది. హ్యాకర్లు అనేక టూల్స్ సహాయంతో వాటిని తస్కరిస్తారు. మీరు పబ్లిక్ వైఫై లేదా ఉచిత వైఫై ద్వారా ఏదైనా లావాదేవీ చేస్తే మాత్రం కచ్చితంగా బ్యాంకు వివరాలు దోచేస్తారు.

పబ్లిక్ వైఫై ద్వారా, హ్యాకర్లు మీ స్మార్ట్‌ఫోన్‌లో మాల్‌వేర్‌ను ఇంజెక్ట్ చేయవచ్చు. దీని తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌ని రిమోట్‌గా కంట్రోల్ చేసుకుంటూ సమాచారాన్ని దొంగిలిస్తారు. వైఫై సిగ్నల్స్‌ని కూడా ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ద్వారా దొంగలిస్తారు హ్యాకర్లు.