Singer Madhupriya : తనను వేధిస్తున్నారంటూ సింగర్ మధుప్రియ కంప్లైంట్..

సింగర్ మధుప్రియ గుర్తు తెలియని వ్యక్తులు తనను వేధిస్తున్నారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..

Singer Madhupriya : తనను వేధిస్తున్నారంటూ సింగర్ మధుప్రియ కంప్లైంట్..

Singer Madhupriya Files Complaint Against Uknown Persons Harassment

Updated On : May 22, 2021 / 3:53 PM IST

Singer Madhupriya: తన మధురమైన గొంతుతో మైమరపించే పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మధుప్రియ గుర్తు తెలియని వ్యక్తులు తనను వేధిస్తున్నారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..

గత రెండు రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు కొత్త కొత్త నెంబర్ల నుండి కాల్స్, మెసేజెస్ చేసి వేధిస్తున్నారని  మధుప్రియ ఫిర్యాదులో పేర్కొన్నారు.. పద్ధతిగా చెప్తున్నా వినకుండా పదే పదే విసిగించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు..

 

బ్లాంక్ కాల్స్‌తో పాటు సోషల్ మీడియాలో అసభ్యకరమైన మెసేజులు పంపుతూ హింసిస్తున్నారని, వారి వేధింపులకు తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని మధుప్రియ కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..