Smriti Irani : స్త్రీలలో రుతుస్రావం.. పరిశుభ్రత గురించి ఎందుకు మాట్లాడకూడదు?.. స్మృతి ఇరానీ యాడ్ వైరల్
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏదైనా ధైర్యంగా మాట్లాడతారు. 25 ఏళ్ల క్రితం స్త్రీలలో రుతుస్రావం- పరిశుభ్రత అనే అంశంపై తాను చేసిన యాడ్‌ను ఆమె గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Smriti Irani
Smriti Irani : కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన వృత్తికి సంబంధించిన అంశాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను పంచుకుంటారు. తాజాగా 25 సంవత్సరాల క్రితం తాను చేసిన ఓ యాడ్‌ను షేర్ చేశారు. ఈ పాత వీడియో చూసి చాలామంది రియాక్ట్ అయ్యారు
గ్లామర్ ప్రపంచంలో సినిమా, యాడ్ ఒప్పుకునేందుకు నటీమణులు ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే చేసేది ఏదైనా దాని ప్రభావం ఇతర అవకాశాలపై పడకూడదని భావిస్తారు. 25 సంవత్సరాల క్రితం స్మృతి ఇరానీకి పెద్ద కంపెనీ యాడ్‌లో నటించే అవకాశం వచ్చింది. అదీ శానిటరీ ప్యాడ్ ప్రకటన. స్మృతి అప్పుడే తన కెరియర్‌ని మొదలు పెట్టారు.
సహజంగా కెరియర్‌లో అడుగు పెడుతూనే ఇలాంటి యాడ్‌లలో నటించడం ఎంతవరకూ కరెక్ట్ అని చాలామంది సందిగ్ధంలో ఉంటారు. కానీ ఆమె ఈ యాడ్‌లో నటించడానికి అస్సలు ఆలోచించకుండా ఎస్ చెప్పారట. రుతుస్రావం సమయంలో స్త్రీలు పాటించాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రతపై ఎందుకు మాట్లాడకూడదు? ఇందులో తప్పేముందని ఆమె ఆ ప్రకటనలో నటించారట. ఇప్పుడు అదే యాడ్‌ను ఆమె ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Smriti Irani’s daughter Marriage: స్మృతి ఇరానీ కుమార్తె పెళ్లి.. అల్లుడు ఏం చేస్తాడో తెలుసా..!
ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు ‘అప్పటికీ ఇప్పటికీ మీ వాయిస్, భాషపై పట్టు అలాగే ఉంది.. మీరేం మారలేదు’ అని కొందరు.. ‘భాషపై మీకున్న కమాండ్‌కి మేము అభిమానులం’ అని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
View this post on Instagram