Friendship Hindu mythology : పురాణాల్లో దోస్తులు.. మంచైనా, చెడైనా స్నేహితులని వదలలేదు

పగ, ప్రతీకారం, ద్వేషం, ప్రేమ, స్నేహం.. పురాణాల్లో అనేక కథల్లో విభిన్నమైన షేడ్స్ కనిపిస్తాయి. అయితే గొప్ప స్నేహితులు ఉన్నారు. వారి స్నేహాలు ఇప్పటి తరాలకు స్ఫూర్తి. పురాణాల్లో గొప్ప దోస్తులను ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రేరణ పొందుదాం.

Friendship in Hindu mythology

Friendship in Hindu mythology : పురాణాల్లో కూడా గొప్ప స్నేహితులు ఉన్నారు. వారి స్నేహాలు అందరిలో స్ఫూర్తినిస్తాయి. స్నేహానికి నిర్వచనంగా నిలిచాయి.

Friendship Band : ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కొంటున్నారా? ఏ రంగు దేనికి సంకేతమో తెలుసా?

స్నేహం గురించి చెప్పుకోవాలంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది కృష్ణుడు-కుచేలుడి స్నేహం. సాందీపని ఆశ్రమంలో ఇద్దరు కలిసి చదువుకున్నారు. కృష్ణుడు మధురకు రాజు అయితే కుచేలుడు కడు పేదరికంతో తన కుటుంబాన్ని పోషించడానికి కష్టపడేవాడు. ఓసారి కుచేలుడు కృష్ణుడిని కలవడానికి ద్వారకకు వెళ్లాడు. తనను కృష్ణుడు అసలు గుర్తిస్తాడో లేదో అని సంకోచిస్తాడు. అయితే కృష్ణుడు కుచేలుడిని చూడగానే ఘనంగా స్వాగతం పలికాడు. కుచేలుడు తనతో తెచ్చిన అటుకులు ఇవ్వడానికి కూడా సంకోచిస్తాడు. కృష్ణుడు అటుకులను స్వీకరించి కుచేలుడికి అపారమైన సంపదను ఇస్తాడు. వీరిద్దరి మధ్య స్నేహబంధం ఎంతో గొప్పది.

 

ద్రోణుడు, ద్రుపదులు కూడా గొప్ప స్నేహితులు. ఇద్దరు బాల్యమంతా గురుకులంలో గడిపారు. గురువు అప్పగించిన పనిలో ద్రోణుడు ద్రుపదుడికి సాయం చేశాడు. అందుకు ద్రుపదుడు కృతజ్ఞతతో ‘నేను రాజు అయినపుడు నీకు రాజ్యంలో సగ భాగం ఇస్తాను’ అని వాగ్దానం చేస్తాడు. అయితే ద్రోణుడు రాజు అవుతాడు. కడు పేదరికంలో ఉన్న ద్రోణుడు ద్రుపదుడి సాయం కోసం వెళ్తాడు. అప్పుడు ద్రుపదుడు అందరి ముందు అతని పేదరికాన్ని అవహేళన చేస్తాడు. అప్పుడు ద్రోణుడు ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. వారి మధ్య స్నేహం కాస్తా శత్రుత్వంగా మారి కురుక్షేత్ర యుద్ధం చివరి వరకూ సాగింది.

Best Friends : 7 ఖండాలు..18 దేశాలు..80 రోజులు.. 81 ఏళ్ల వయసులో చుట్టేసిన ప్రాణస్నేహితులు.. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరి..

కర్ణుడు, దుర్యోధనుల స్నేహం కూడా ఎంతో గొప్పది. కర్ణుడు స్నేహం విలువలను కాపాడిన నిజమైన స్నేహితుడు. అర్జునుడితో సమానమైన యోధుడిని మాత్రమే కోరుకున్న దుర్యోధనుడి ఉద్దేశాలు స్వార్థపూరితమైనవి. కర్ణుడిని అందరూ ఆటపట్టించినపుడు, అర్జునుడితో ఏ విధంగా సమానం కాలేడని చెప్పినపుడు దుర్యోధనుడు తన స్నేహ హస్తాన్ని చాచి కర్ణుడిని అంగరాజును చేసాడు. కర్ణుడు చివరి వరకు దుర్యోధనుడికి నమ్మకమైన స్నేహితుడిగా నిలిచాడు. కురుక్షేత్ర యుద్ధంలో ధైర్య, పరాక్రమాలు ప్రదర్శించి దుర్యోధనుడి పక్షాన పోరాడుతూనే మరణించాడు.

 

రామ, సుగ్రీవుల మధ్య స్నేహానికి హనుమంతుడు వారధిగా నిలిచాడు. అగ్ని సాక్షిగా వారు స్నేహితులు అవుతారు. సుగ్రీవుడు తన సొంత సోదరుడు వాలి నుండి తనను తాను కాపాడుకోవడానికి దాక్కున్నాడని తెలుసుకున్న రాముడు అతనిని రక్షించాలని నిర్ణయించుకుంటాడు. వాలిని పడగొట్టి సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేస్తాడు. రామ-రావణ యుద్ధంలో సుగ్రీవుడు రాముడికి తనవంతు సాయం చేస్తాడు.

Friendship Movies : స్నేహ బంధాన్ని చాటి చెప్పిన తెలుగు సినిమాలు.. ఇప్పుడు చూసినా ఎమోషన్ అవుతారు!

కృష్ణార్జుల స్నేహం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరు గొప్ప స్నేహితులు. మహా భారత యుద్ధంలో కృష్ణుడు అర్జునుడి వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తాడు. మార్గాన్ని చూపిస్తూ విజయపథంవైపు నడిపిస్తాడు. గీతను ఉపదేశిస్తాడు. నిజమైన స్నేహితులు తమ మిత్రులకు ఎప్పుడూ అండగా నిలబడతారు.  వారి లక్ష్యాల్లో పాలు పంచుకుంటారు. వారిని ముందుకు నడిపిస్తారు. వీరిద్దరి స్నేహం అందరికీ స్ఫూర్తి దాయకం.

ట్రెండింగ్ వార్తలు