Friendship Movies : స్నేహ బంధాన్ని చాటి చెప్పిన తెలుగు సినిమాలు.. ఇప్పుడు చూసినా ఎమోషన్ అవుతారు!

టాలీవుడ్‌లో స్నేహం బంధాన్ని చాటి చెప్పే అద్భుతమైన సినిమాలు వచ్చాయి. స్నేహం కోసం ప్రేమను త్యాగం చేయడం,. స్నేహం కోసం ప్రాణాలు అర్పించడం.. వంటి కథాంశాలతో పాటు ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య గొప్ప స్నేహబంధం ఉంటుందని చాటి చెప్పే సినిమాలు వచ్చాయి. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా అలాంటి సినిమాల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం.

Friendship Movies : స్నేహ బంధాన్ని చాటి చెప్పిన తెలుగు సినిమాలు.. ఇప్పుడు చూసినా ఎమోషన్ అవుతారు!

Movies made on friendship

Telugu Movies on Friendship : ఫ్రెండ్షిప్ డే అనగానే స్నేహం గురించి ఎంతో గొప్పగా చూపించిన సినిమాలు.. పాటలు గుర్తుకొచ్చేస్తాయి. స్నేహ బంధాన్ని అద్భుతంగా తెరపై చూపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. స్నేహానికి గొప్ప నిర్వచనాన్ని ఇచ్చాయి. ఆగస్టు 6 ‘అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం’ సందర్భంగా అలాంటి కొన్ని సినిమాల్ని గుర్తు చేసుకుందాం.

ప్రేమదేశం
స్నేహం త్యాగాన్ని కోరుతుంది అంటారు. అందుకు నిదర్శనంగా వచ్చిన సినిమా ప్రేమదేశం. అబ్బాస్, వినీత్, టబు ముఖ్యపాత్రల్లో 1996 లో కదిర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకే అమ్మాయిని ప్రేమించినపుడు ఎదురైన సమస్యలు.. తిరిగి వాటిని అధిగమించి మంచి స్నేహితులుగా ఎలా మిగిలారో దర్శకుడు అద్భుతంగా చూపించాడు.

Movies made on friendship 1

Telugu Movies on Friendship

స్నేహం కోసం
స్నేహం కోసం ప్రాణం ఇవ్వడమంటే ఏంటో ‘స్నేహం కోసం’ సినిమాలో కనిపిస్తుంది. 1999 లో వచ్చిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, మీనా, విజయ్ కుమార్, ప్రకాష్ రాజ్ వంటి స్టార్లు నటించారు. ఇద్దరు స్నేహితుల్లో ఒకరిపైకి శత్రువు అటాక్ చేయగానే అతని స్నేహితుడు అడ్డు వెళ్లి ప్రాణాలు కోల్పోతాడు. స్నేహితుడి మరణం తట్టుకోలేక అతని స్నేహితుడు కూడా గుండె ఆగి చనిపోతాడు. ఈ సినిమాలోని సీన్ ఎప్పుడు చూసినా కంటి నీరు ఆగదు.

FRIENDSHIP DAY2

వసంతం
ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య కేవలం ప్రేమ మాత్రమే కాదు.. అంతకంటే గొప్ప స్నేహం ఉంటుందని చాటి చెప్పిన చిత్రం వసంతం. 2003 లో రిలీజైంది. వెంటేష్, కళ్యాణి, ఆర్తి అగర్వాల్ నటించిన ఈ సినిమా అప్పట్లో అందరినీ ఆలోచింపచేసింది.

VASANTHAM

హ్యాపీ డేస్
కాలేజ్ లో 8 మంది స్నేహితుల మధ్య జరిగిన సంఘటనల సమాహారం హ్యాపీడేస్ సినిమా. ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లో స్నేహితుల మధ్య జరిగిన అనుభవాలు అందంగా చూపించారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. 2007 లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది.

HAPPY DAYS

ఉన్నది ఒకటే జిందగీ

ఇద్దరు ప్రాణ స్నేహితులు విడిపోవడానికి ఒక అమ్మాయి కారణం అయితే ఆ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనే కథాంశంతో 2017 లో వచ్చిన ఉన్నది ఒకటే జిందగీ అందర్నీ అలరించింది. రామ్, శ్రీవిష్ణు, అనుపమ పరమేశ్వరన్ కీ రోల్స్ లో నటించారు. క్లైమాక్స్ కన్వీన్సింగ్ గా తీశాడు డైరెక్టర్.

unnadi okate jindagi

ఓ మై ఫ్రెండ్
ఒక అబ్బాయి, అమ్మాయి సన్నిహితంగా ఉంటే వారి మధ్య ప్రేమ ఉందని అనుకుంటారు అందరూ.. కానీ అంతకంటే గొప్ప స్నేహబంధం ఉందని చాటి చెబుతారు. 2011 లో సిద్దార్థ్, హన్సిక, శృతి హాసన్ ముఖ్యపాత్రల్లో నటించిన ఓ మై ఫ్రెండ్ సినిమా మంచి హిట్ అందుకుంది.

oh my friend

కేరింత
కాలేజీ లైఫ్ లో స్నేహం, ప్రేమ కామనే. ఒకే కాలేజ్ లో చదువుకున్న ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల మధ్య జీవితం, ప్రేమ.. వాళ్ళు కాలేజ్ లో ఎలాంటి సమయం గడిపారో ఈ సినిమాలో అందంగా చూపించారు. వారు తమ జీవితాల్లోని కఠినమైన వాస్తవాలను ఎదుర్కొని, విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు విషయాలు యు-టర్న్ తీసుకుంటాయి. ఈ మూడు జంటలు ఒకరినొకరు కలుసుకుని జీవితంలో తమ లక్ష్యాలను ఎలా సాధిస్తారు అనేది మిగతా కథ.

kerintha

kerintha telugu movie

అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్

నిఖిల్, మేఘా బర్మన్ నటించిన ఈ సినిమాలో  మంచి స్నేహితులైన అమ్మాయి, అబ్బాయి మధ్య విభేదాలు ఎలా వచ్చాయి? మళ్లీ తిరిగి ఎలా కలిశారు? అనే కథాంశంతో ఆకట్టుకుంది.

ankit pallavi

ankit pallavi and friends movie

ఇలా చెప్పుకుంటే వెళ్తే.. స్నేహమంటే ఇదేరా, స్నేహితుడు, చిన్ననాటి స్నేహితులు, ప్రాణ స్నేహితులు,  మంచి మిత్రులు, ప్రాణ మిత్రులు, ముగ్గరు మిత్రులు, నిప్పులాంటి మనిషి,  ముగ్గురు మిత్రులు ఇలా స్నేహం గురించి అనేక సినిమాలు వచ్చాయి. అటు బాలీవుడ్ లో షోలే, ఆనంద్, రంగ్ దే బసంతి, జిందగీ నా మిలేగీ దోబారా వంటి సినిమాలు స్నేహబంధాన్ని అద్భుతంగా చాటి చెప్పాలి. జీవితంలో ప్రేమకంటే స్నేహం గొప్పదని గొప్ప నిర్వచనాన్ని ఇచ్చాయి.