Best Friends : 7 ఖండాలు..18 దేశాలు..80 రోజులు.. 81 ఏళ్ల వయసులో చుట్టేసిన ప్రాణస్నేహితులు.. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరి..

స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లు, టూర్లు వెళ్లడం కామనే. కానీ 81 ఏళ్ల వయసులో ప్రపంచ దేశాలు చుట్టి రావడం అంటే మామూలు విషయం కాదు. ఇద్దరు ప్రాణ స్నేహితులు 18 దేశాలు 81రోజుల్లో చుట్టి వచ్చేశారు.

Best Friends : 7 ఖండాలు..18 దేశాలు..80 రోజులు.. 81 ఏళ్ల వయసులో చుట్టేసిన ప్రాణస్నేహితులు.. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరి..

Best Friends

Best Friends : మనసు ఉండాలే కానీ వయసు ఓ నెంబర్ అంటారు.. నిజమే కానీ వయసు పెరిగే కొద్దీ ఎక్కడికైనా వెళ్లాలంటే శరీరం సహకరించద్దూ అనే వాళ్లు ఉంటారు. అలాంటి వాళ్లు ఈ స్టోరీ తప్పకుండా చదవాలి.

corona effect : 2 ఏళ్ల తర్వాత కాఫీ స్మెల్ గుర్తుపట్టిన మహిళ ఎమోషనల్ వీడియో వైరల్

యూఎస్ఏ (USA) టెక్సాస్‌కి (Texas) చెందిన ఇద్దరు ప్రాణ స్నేహితులు వరల్డ్ టూర్‌కి ప్లాన్ చేసుకున్నారు. అదీ 81 ఏళ్ల వయసులో. దీన్ని సాహసమనే చెప్పాలి. ఎల్లీ హంబీ (Ellie Hamby), శాండీ హాజెలిప్ (Sandy Hazelip) ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. జనవరిలో 80 రోజుల ప్రపంచ పర్యటనకు (world tour) బయలుదేరారు. వీరిద్దరూ 23 ఏళ్లుగా ప్రాణ స్నేహితులు. ఎల్లీ హంబీ ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్‌గా (international documentary photographer), శాండీ హాజెలిప్ డాక్టర్‌గా పని చేశారు. ఇక వీరిద్దరూ ఎన్నో సంవత్సరాలుగా ప్లాన్ చేసుకున్న వరల్డ్ టూర్‌  సేఫ్‌గా పూర్తి చేసుకుని టెక్సాస్‌లో తమ ఇళ్లకు చేరుకున్నారు.

Ganguly vs Kohli: గంగూలీని పట్టించుకోని కోహ్లీ.. కరచాలనం చేయకుండా ముందుకెళ్లిన దాదా .. వీడియో వైరల్

గత కొంతకాలంగా వీరిద్దరికీ ప్రపంచ పర్యటన ఆలోచన ఉన్నా కరోనా మహమ్మారి కారణంగా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. చివరికి జనవరిలో టూర్‌కి బయలుదేరిన వీరు ముందు అంటార్కిటికాకు (Antarctica) వెళ్లారు. అలా ఏడు ఖండాల్లోని 18 దేశాలను చుట్టేశారు. ఆస్ట్రేలియా (Australia), ఇండోనేషియా (Indonesia), జపాన్ (Japan), నేపాల్ ( Nepal), ఫిన్లాండ్ (Finland), అర్జెంటీనా (Argentina) తరువాత ఇండియాకు ( India) వచ్చారు. ఈ టూర్‌లో వారు తిరిగిన ప్రతిచోటా సౌకర్యవంతంగా ఉందా? లేదా? అనేకంటే మర్చిపోలేని అనుభవాల్ని మూటకట్టుకున్నారు. వీరికి ముఖ్యంగా ఇండియా చాలా నచ్చిందట. ఢిల్లీలోని కుతూబ్ మినార్, ఇండియా గేట్, జామా మసీద్ చాలా నచ్చాయట. అలాగే ఉదయ్‌పూర్ (Udaipur) లోని 180 సంవత్సరాల పురాతన భవనంలో కూడా బస చేశారట. చివరగా ఆగ్రాలోని తాజ్ మహల్‌ని సందర్శించి తమ 50వ రోజు పర్యటన సమయానికి భారత్‌లో ఉన్నారట. ప్రపంచంలో మనకి నచ్చిన ప్రాంతాలు తిరగడానికి.. మనకి తెలియని ఎన్నో అంశాలు తెలుసుకోవడానికి వయసు అడ్డంకి కాదని వాళ్ల అనుభవం ద్వారా అందరికీ తెలియచెప్పారు. వీరి స్నేహం.. వీరి ప్రపంచ పర్యటన ఇప్పుడు అందరినీ ఇన్‌స్పైర్ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Around The World at 80 (@aroundtheworldat80)