రానా, రవితేజ సెట్ అయ్యారా!
మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్‌లో రానా, రవితేజ..

మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్‌లో రానా, రవితేజ..
మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి గతకొంత కాలంగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. అయ్యప్పనుమ్ నాయర్ అనే పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ హవాల్దార్ కోషి కురియన్ మధ్య నడిచే ఈగో వార్‌కి సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇది. పోలీస్ అధికారిగా బిజు మీనన్, రిటైర్డ్ హవాల్దార్‌గా పృథ్వీరాజ్ అద్భుతంగా నటించారు.
బిజు మీనన్ పాత్రను బాలయ్యతో, పృథ్వీరాజ్ క్యారెక్టర్ కోసం రానాను సంప్రందించారని వార్తలు వచ్చాయి కానీ బాలయ్య ప్రస్తుతం రీమేక్ చేసే ఆలోచన లేదని తేల్చేశాడు. ఎట్టకేలకు సితార సంస్థ రవితేజ, రానాలను సెట్ చేసిందని సమాచారం. యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.