లాక్డౌన్ టైమ్.. ఫిట్నెస్ ఫ్రీక్‌గా మారిన యంగ్ హీరో..
లాక్డౌన్ సమయంలో సరికొత్త లుక్‌లోకి మారిపోయిన యంగ్ హీరో సందీప్ కిషన్..

లాక్డౌన్ సమయంలో సరికొత్త లుక్‌లోకి మారిపోయిన యంగ్ హీరో సందీప్ కిషన్..
లాక్డౌన్ సమయాన్ని సెలబ్రిటీలు చక్కగా వినియోగించుకుంటున్నారు. నచ్చిన పనులు చేయడం, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, కొత్త సినిమాల కోసం మేకోవర్ కావడం, పెండింగ్ పనులు పూర్తి చేయడం, ఇష్టమైన పనులు నేర్చుకోవడం వంటివన్నీ చేసేస్తున్నారు. యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ లాక్డౌన్ సమయంలో ఫిట్నెస్ ఫ్రీక్‌గా మారిపోయాడు.
సినిమా షూటింగ్స్ లేకపోవడంతో సందీప్ తన మేకోవర్‌పై దృష్టి పెట్టాడు. అతని తాజా సరికొత్త లుక్ చూస్తుంటే సందీప్ సిక్స్ ప్యాక్ లుక్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. దాదాపు పన్నెండు కిలోల బరువు తగ్గి ఈ లుక్‌లోకి మారిపోయాడు సందీప్. సందీప్ కొత్త లుక్కు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా హాకీ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
Read: ఇంటిపేరు వల్లే హీరోయిన్గా ఎదిగావు.. కరీనాపై నెటిజన్ల ఆగ్రహం..