Green India Challenge : తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన సూపర్ స్టార్ కృష్ణ గారు..

నానక్ రామ్ గూడాలోని తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు సీనియర్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ గారు..

Green India Challenge : తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన సూపర్ స్టార్ కృష్ణ గారు..

Green India Challenge

Updated On : May 31, 2021 / 3:57 PM IST

Green India Challenge: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ట్విట్టర్ ద్వార తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి వారు ఇచ్చిన పిలుపుమేరకు ఈరోజు నానక్ రామ్ గూడాలోని తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు సీనియర్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ గారు..

ఈ సందర్భంగా కృష్ణ గారు మాట్లాడుతూ.. ‘‘పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి పై బాధ్యత ఉంది అని అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో పచ్చదనం పెంచడం కోసం చైతన్యం తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం, అతను చేస్తున్న కృషికి నేను మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు కృష్ణ గారు..