Rajinikanth
Rajinikanth: సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తై సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు కానీ తమిళంలో మాత్రం సక్సెస్ సినిమా అనిపించుకుంది. దానికి కారణం రజని స్టామినా అని కూడా అనుకున్నారు. అయితే.. ఆ క్రెడిట్ ను కూడా సినిమా టీమ్ కు ఇచ్చేసిన రజని వారికి బహుమతులు ఇచ్చి కృతజ్ఞతలు చెప్పాడు. ముందుగా దర్శకుడు శివకు గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇచ్చాడు. తాజాగా.. మిగతా యూనిట్ సభ్యులకు కూడా గోల్డ్ చైన్స్ బహుమతిగా ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు.
Bollywood Heroin’s: ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్స్.. పట్టించుకోవడమే మానేసిన మేకర్స్!
ఈ సినిమా రిలీజై 50 రోజులైన సందర్భంగా రజినికాంత్ అన్నాత్తె మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్యుయేల్‌తో పాటు ప్రధాన టెక్నీషియన్లందరినీ ఆహ్వానించి బంగారు చెయిన్లను బహుమతిగా అందించాడు. రజనీకాంత్ తమ శ్రమను గుర్తించి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు ఇవ్వడంపై తెర వెనుక పనిచేసిన టెక్నీషియన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అరుదుగా ఇలా శ్రమను గురించే హీరోలు ఉంటారని.. అది రజిని మంచి మనసుకు నిదర్శనమని కోలీవుడ్ సినీ వర్గాలు రజనిని కొనియాడుతున్నాయి.
KGF2: ‘కేజీఎఫ్ 2’ రీషూట్.. వైరల్ అవుతున్న యష్ ఫోటోలు
కాగా, మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘అన్నాత్తై’ చిత్రం తెలుగులో ‘పెద్దన్న’ గా విడుదలైన సంగతి తెలిసిందే. రజనీ సరసన నయనతార హీరోయిన్‌గా నటించగా కీర్తి సురేశ్ సోదరి పాత్రలో కనిపించింది. ఖుష్బూ, మీనా, జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెలుగులో పెద్ద హిట్ కాకపోయినప్పటికీ తమిళంలో అన్నాత్తై మాత్రం మంచి వసూళ్లు రాబట్టి రజని స్టామినా ఏంటో నిరూపించింది.
https://twitter.com/immancomposer/status/1473983064007077893?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1473983064007077893%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fsuperstar-rajinikanth-gold-chain-gift-annaatthe-movie-team-1422271