Bollywood Heroin’s: ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్స్.. పట్టించుకోవడమే మానేసిన మేకర్స్!

డ్రగ్స్ కల్చర్, నెపోటిజం, హరాజ్ మెంట్, సూసైడ్స్, ఫేవరిటిజం, పేమెంట్ లో తేడాలు.. ఇవి ఎక్కువగా బాలీవుడ్ లో పైకి కనిపించే సమస్యలు. కానీ ఒకటుంది.. పెద్దగా డిస్కషన్స్ దాని గురించి..

Bollywood Heroin’s: ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్స్.. పట్టించుకోవడమే మానేసిన మేకర్స్!

Bollywood Heroin's

Bollywood Heroin’s: డ్రగ్స్ కల్చర్, నెపోటిజం, హరాజ్ మెంట్, సూసైడ్స్, ఫేవరిటిజం, పేమెంట్ లో తేడాలు.. ఇవి ఎక్కువగా బాలీవుడ్ లో పైకి కనిపించే సమస్యలు. కానీ ఒకటుంది.. పెద్దగా డిస్కషన్స్ దాని గురించి జరుగవు కానీ దాన్ని ప్రాబ్లమ్ గానే ఫేస్ చేస్తున్నారు హీరోయిన్స్. అయితే అది బాలీవుడ్ లో మాత్రమే అని చెప్పలేం.. అన్ని ఇండస్ట్రీల్లోనూ కామన్ గానే కనిపిస్తుందిప్పుడు. హీరోలకు వయసుతో సంబంధం లేదు కానీ ఏజ్ దాటితే హీరోయిన్ ను పట్టించుకునే మేకర్స్ లేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎక్కడైనా హీరోయిన్స్ కు చాలా తక్కువ స్పేస్ ఉంటుంది, తక్కువ స్పాన్ ఉంటుందన్నది కాదనలేని నిజం. హిట్, ఫ్లాప్ ల పైనే గ్లామర్ గర్ల్ భవిష్యత్ ను డిసైడ్ చేస్తారు.

KGF2: ‘కేజీఎఫ్ 2’ రీషూట్.. వైరల్ అవుతున్న యష్ ఫోటోలు

అయితే కొంతమందిని మినహాయిస్తే.. 35 దాటి 40 దగ్గరపడుతుంటే ఆటోమేటిక్ గా అందాల భామలకు అవకాశాలు తగ్గిపోతాయి. 35 ఏళ్లు దాటిన దీపికా పదుకొనే, 37ఏళ్లున్న కత్రినా కైఫ్, 40ని క్రాస్ చేసిన కరీనా కపూర్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా హాట్ గర్ల్స్ గానే కొనసాగుతున్నారు. కానీ వాళ్లు మేల్ డామినేషన్ ను ఫేస్ చేస్తున్నారనేది అందరికి తెలిసిందే. రెమ్యునరేషన్ విషయంలోనైనా, క్యారెక్టర్ స్పేస్ పరంగానైనా వాళ్లు వెనకే ఉన్నారు. కానీ 50 క్రాస్ చేసిన షారూఖ్, సల్మాన్, అమీర్, సైఫ్‌లతో పాటు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ బాలీవుడ్‌ను ఎలా శాసిస్తున్నారో చూస్తూనే ఉన్నాం.

2022 Telugu Films: ఒక్కో హీరో నాలుగైదు సినిమాలు.. ఏడాదంతా జాతరే!

సల్మాన్, షారుఖ్, అక్షయ్, అజయ్ దేవగణ్ లపై నిర్మాతలు పెట్టుబడి పెట్టడానికి ఇప్పటికీ వెనుకాడరు. గత 30 ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్న వీళ్లు.. వాళ్ల స్టార్ అప్పీల్‌ను బాలీవుడ్ లో ఫిక్స్ చేసుకున్నారు. భారీ బడ్జెట్ సినిమాలతో ఫోజులు కొట్టడమే కాదు.. ఆ సినిమాలో ఎక్కువ స్క్రీన్ స్పేస్ హీరోలకే దక్కుతుంది. కనీసం మూవీ పోస్టర్స్ లో కూడా హీరోయిన్ కి ప్లేస్ దొరకట్లేదు. ఇంక ఆ సినిమా గానీ బంపర్ హిట్ కొట్టిందంటే.. ఆ క్రెడిట్ మొత్తం కొట్టేసేది హీరోనే. అంతేనా ఆ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ నుంచి షేర్స్ కూడా వచ్చేస్తాయి.

Ashu Reddy: ఆగని హాట్ పోజులు.. ఆపని ఫోటో షూట్లు!

హీరోయిన్స్ మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్, కాజోల్, రవీనా టండన్, జూహీచావ్లా, శిల్పాశెట్టి, ఐశ్యర్యారాయ్.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న మేల్ స్టార్స్ తో 90ల్లో ఆడిపాడిన హీరోయిన్స్ వీళ్లు. ఈ గ్లామర్ డాల్స్ అందరూ హెవీ స్టార్ డం ను చూసిన వాళ్లే. అయితే ప్రెజెంట్ ఈ హీరోయిన్స్ పొజిషన్ చూస్తే.. సీన్ మొత్తం అర్దమవుతుంది. ఓ సినిమాలో లీడ్ క్యారెక్టర్, ఓ బ్రాండ్ కి గ్రాండ్ అంబాసిడర్ కాదు కదా కనీసం ఒక సినిమా పోస్టర్ లో కూడా వీళ్లకు స్పేస్ దక్కడం కష్టమే.

Disha Patani: నెట్టింటిని షేక్ చేస్తున్న లోఫర్ బ్యూటీ

హిట్ సినిమాలు, గుర్తుండిపోయే బంపర్ సాంగ్స్ ఇచ్చిన హీరోయిన్స్.. ఇప్పుడు సందడి చేసేది బుల్లితెరపైనే. బాలీవుడ్ స్మాల్ స్క్రీన్ పై ఏ డాన్సింగ్ రియాలిటీ షో చూసినా.. మాధురీ, శిల్పాశెట్టి, రవీనా టండన్ లాంటి వారే కనిపిస్తారు. ఇప్పుడిప్పుడే వీళ్లకి ఓటీటీ మంచి ఆప్షన్ గా మారుతోన్న అక్కడా గట్టి పోటీ కనిపిస్తోంది. రాణీ ముఖర్జీ, సుస్మితా సేన్, టబూ లాంటి వారు మాత్రం అడపాదడపా సినిమాల్లోనో, వెబ్ సిరీస్ లోనో మెరుస్తున్నారు.

New Film Releases: టెన్షన్ పెడుతున్న ఒమిక్రాన్.. వర్రీ అవుతున్న హీరోలు!

మేల్ స్టార్స్ కి పరిమితులుండవ్ ఇండస్ట్రీలో. పెళ్లై పిల్లలున్నా.. వారి పెళ్లిలవుతున్నా.. వాళ్లకి పిల్లలొస్తున్నా హీరోలుగానే ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తారు. అది హీరోయిన్స్ విషయంలో పనికిరాదు. పెళ్లయిదంటే స్టార్ హీరోయిన్ ను నంబర్ 2 క్యాటగిరీలో వేసే బాలీవుడ్ మేకర్స్.. వారు పిల్లల్ని కంటే పట్టించుకోవడం కూడా మానేస్తారు. రవీనా, శిల్పాశెట్టి, మాధురీ, కరిష్మా కపూర్ లాంటి హీరోయిన్స్.. పెళ్లై.. బిడ్డలకి జన్మనిచ్చాక.. నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమై.. స్మాల్ స్క్రీన్ కి దగ్గరయ్యారు.

WWW Movie: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు) సినిమా రివ్యూ

కరీనా, అనుష్కా శర్మ, దీపికా, ప్రియాంక, కత్రినా ఇంకా స్టార్ డం ను ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్లలో కరీనా, అనుష్కా మాతృత్వాన్ని కూడా ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి అప్పటి హీరోయిన్స్ లా కాకుండా.. వీళ్లు ఇంకొన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో సినిమాలు చేయొచ్చు. అదీ కొన్ని కండీషన్స్ కి లోబడి. ఎందుకంటే కరీనా లాంటి వాళ్లు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే ఎంతలా ట్రోలింగ్ జరిగిందో తెలుసు కదా. సో కామ్ గా వచ్చిన అవకాశాల్ని వాడుకుంటేనే ట్రెండింగ్ లో ఉంటారు.

Shyam Singha Roy: నాని శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ

ఇదీ అన్ని ఇండస్ట్రీల్లో కనిపించే భాగోతమే. తెలుగులో ఏదో రమ్యకృష్ణ, మీనా లాంటి వాళ్లు సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ తో కనిపిస్తున్నారు. మిగిలిన వాళ్లు ఎప్పుడో తల్లి, అత్త రోల్స్ కి షిఫ్ట్ అయ్యారు. అయితే గత 10, 15 ఏళ్లుగా టాప్ పొజిషన్ లో కూర్చున్న హీరోయిన్స్ ఇక్కడా నెమ్మదిగా సైడ్ కి తప్పుకుంటున్నారు. త్రిషా, కాజల్, శ్రీయా, తమన్నా లాంటి వాళ్ల కెరీర్ స్లోగా డౌన్ ఫాల్ అవడం చూస్తూనే ఉన్నాం. అయినా కొత్త నీరు రావడం.. పాత నీరు పోవడం ఎక్కడైనా జరిగేదే కదా.