Etela jamuna : మెదక్ కలెక్టర్‌పై ఈటల రాజేందర్ భార్య జమున ఆగ్రహం..

మెదక్ కలెక్టర్‌పై ఈటల రాజేందర్ భార్య జమున ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము భూములు ఆక్రమించుకున్నామని కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పటమేంటీ? ఆయనపై కేసు పెడతాం అన్నారు జమున.

Etela jamuna fires on medak collector : మెదక్ కలెక్టర్‌పై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేంద్రం భార్య జమున తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మీడియాలో తమ గురించి దుష్ప్రచారం చేసిన కలెక్టర్‌పై కేసు పెడతామని జమున హెచ్చరించారు. కలెక్టర్ అయి ఉండి..ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీ కండువా కప్పుకొని ఆయన మాట్లాడుతున్నారంటూ కలెక్టర్ ని దుయ్యబట్టారు. జమున హేచరీస్‌ భూములపై కలెక్టర్‌ హరీశ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టడానికి ఆయనకు ఏం అధికారం ఉందని జమున ప్రశ్నించారు. ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించామని..జమున వెల్లడించారు.

Read more : AP High Court: సారీ సరిపోదు..వారం రోజులు వృద్ధులకు సేవ చేసి..వారి ఖర్చులు భరించాలి : అనంతపురం డీఈవోకు కోర్టు ఆదేశం

ఆయన కలెక్టరా? లేక టీఆర్ఎస్ నాయకుడా? అని ప్రశ్నించారు. కలెక్టరే విలేకరుల సమావేశం నిర్వహించి.. ఆ భూముల్ని ఆక్రమించుకున్నారని ఎలా ఆరోపిస్తారు? అంటూ నిలదీశారు. కలెక్టర్‌ రాజకీయ నాయకుడా? టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుచరుడుగా పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. అంటూ జమున ప్రశ్నించారు.మెదక్‌ జిల్లాలోని 81, 130 సర్వే నంబర్‌లలో తమకు 8.30 ఎకరాల భూమి ఉందని..ఈ రెండు సర్వే నెంబర్లలో 70 ఎకరాల భూమిని తాము ఆక్రమించుకున్నామని కలెక్టర్‌ చెప్పడం విడ్డూరంగా ఉందని..ఆ విషయాన్ని ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పటం ఆయనకు విజ్ఞత కాదని అన్నారు. సమాచారాన్ని కోర్టుకు, తమకు ఇవ్వాల్సిన అవసరం ఉందని, కలెక్టర్‌ తమను టార్గెట్ చేసినట్లుగా వ్యవహరిస్తున్నారని జమున అన్నారు.

Read more : Parliament : పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరించనున్న టీఆర్ఎస్ ఎంపీలు

భూములు ఆక్రమించుకున్నారని మాట్లాడినందుకు కలెక్టర్‌పై కేసు పెడతామని జమున తెలిపారు. ఓ కలెక్టర్‌ టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నందుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని అన్నారు. అయితే ఈ కలెక్టర్‌కు మినిస్టర్‌ పదవి ఆఫర్‌ చేశారేమో అందుకే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఈటల జమున ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నామని చెబుతూ.. మహిళనైన తనను ఎందుకు మానసికంగా హింసిస్తున్నారు? అని జమున ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. రామారావు అనే వ్యక్తి దగ్గర 8.30 ఎకరాల భూమి కొన్నామని, అప్పుడు ప్రభుత్వ భూమి కాదని రిజిస్ట్రేషన్‌ చేశారని అన్నారు. ఇప్పుడు అదే భూమి.. ప్రభుత్వ భూమి అంటున్నారని ఈటల జమున అన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే సర్కార్‌ భూమి ప్రైవేటుగా మారుతుంది..అదే వ్యతిరేకంగా ఉంటే ప్రైవేటు భూమి సర్కారు భూమిగా మారుతుందని ఈటల జమున ఎద్దేవా చేశారు.

ట్రెండింగ్ వార్తలు