AP High Court: సారీ సరిపోదు..వారం రోజులు వృద్ధులకు సేవ చేయాలి: అనంతపురం డీఈవోకు కోర్టు ఆదేశం

కోర్టు తీర్పుని ధిక్కరించిన విషయంలో ఏపీ హైకోర్టు డీఈవోకు వింత శిక్ష విధించింది. సారీ సరిపోదు..వారం రోజులు వృద్ధులకు సేవ చేసి..వారి ఖర్చులు భరించాలపి అనంతడీఈవోకు కోర్టు ఆదేశించింది.

AP High Court: సారీ సరిపోదు..వారం రోజులు వృద్ధులకు సేవ చేయాలి: అనంతపురం డీఈవోకు కోర్టు ఆదేశం

Ap Hc  Anantapur Deo To Do Social Service

AP HC  Anantapur DEO to do social service : ఏపీలోని విద్యాశాఖ అధికారికి కోర్టు ఓ వింత శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) కె.శామ్యూల్‌కు సోమవారం (డిసెంబర్ 6,2021) ఓ వింతశిక్ష విధించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించని కారణంగా డీఈవో వృద్ధులకు వారం రోజుల పాటు సేవ చేయాలని..వారి భోజన ఖర్చులన్నీ భరించాలని ఆదేశాలు జారీ చేసింది.

అనంతపురం జిల్లాకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ పి.వెంకటరమణకు నోషనల్ సీనియారిటీ కల్పించే విషయమై 2019లో హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు వెంకటరమణకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఆయనకు సీనియారిటీ కల్పించాలని ఆదేశించింది. కానీ ధర్మాసనం ఆదేశాలను వెంకటరమణ పట్టించుకోలేదు.కోర్టు ఆదేశించినప్పటికీ సీనియారిటీ కల్పించలేదు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఆదేశాలను కూడా పట్టించుకోరా? అంటూ చీవాట్లు వేసింది. దీంతో డీఈవో ధర్మాసనానికి క్షమాపణ చెప్పారు.

Read more : Coronavirus Cases: దేశంలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు

కానీ కోర్టు మాత్రం అతని క్షమాపణ చెప్పటమే కాదు..నిర్లక్ష్యానికి తగిన శిక్ష అనుభవించాలని తెలిపింది. అంతేకాదు ఓ వింత శిక్ష కూడా విధించింది.2019లో డీఈవోపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. దీనిపై సోమవారం ఈ పిటిషన్‌ను విచారించింది.పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్‌, విద్యాశాఖ కమిషనర్‌ వి. చినవీరభద్రుడు, అనంతపురం డిఇఒ కె శామ్యూల్‌ సోమవారం కోర్టుకు హాజరయ్యారు. రాజశేఖర్, చినవీరభద్రుడు ఇచ్చిన వివరణలపై కోర్టు సంతృప్తి చెందగా, శామ్యూల్ ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని బాధ్యులుగా గుర్తించింది.

Read more : Cheddi Gang : చెడ్డీ‌గ్యాంగ్ వేటలో తాడేపల్లి పోలీసులు

అనంతరం కోర్టు.. న్యాయస్థానం ఆదేశాల అమల్లో ఏడాది జాప్యం చోటుచేసుకున్నందుకు డీఈవోను బాధ్యుడిగా తేల్చింది. చీవాట్లు పెట్టింది. దీంతో డీఈవో కోర్టుకు క్షమాపణ కోరారు. కానీ మీరు చెప్పిన క్షమాపణను ధర్మాసనం అంగీకరించాలంటే వారం రోజులపాటు జిల్లాలోని ఏదైనా వృద్ధాశ్రమంలో కానీ..అనాథాశ్రమంలో కానీ సామాజిక సేవ చేయాలని, వారి భోజన ఖర్చులు భరించాలని ఆదేశించారు. ఇందుకు డీఈవో అంగీకరించారు.