Parliament : పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరించనున్న టీఆర్ఎస్ ఎంపీలు

ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ కేంద్రంపై మండిపడుతోంది. ఈక్రమంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొత్తాన్ని బహిష్కరించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.

Parliament : పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరించనున్న టీఆర్ఎస్ ఎంపీలు

Trs To Boycott This Entire Parliament Session

TRS to boycott this entire Parliament session : టీఆర్ఎస్ ఎంపీలో పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించనున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్న క్రమంలో గత కొన్ని రోజులుగా పార్లమెంట్ లో గులాబీ పార్టీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఉభయసభల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వీరి ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పార్లమెంటు సెషన్ మొత్తాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇదే సమయంలో కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కూర్చొని నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు.

Read more : AP Employees: ఉద్యోగుల పోరుబాట.. నేటి నుంచి ఏపీలో నిరసనలు

మరోవైపు టీఆర్ఎస్ ఎంపీలు హైదరాబాద్ కు వచ్చి సీఎం కేసీఆర్ తో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ధాన్యం కొనుగోళ్ల అంశంలో ఒకట్రెండు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో వరి ధాన్యం సేకరణ..12 మంది ఎంపీల సస్పెన్షన్ సహా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలుపై కేంద్ర వైఖరి నిరసనగా పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించనున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. కాగా గత కొంత కాలం నుంచి వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య వార్ కొనసాగుతోంది.

Read more : Chinese Rover: చంద్రుడిపై చిన్న ఇల్లు.. కనిపెట్టేసిన చైనా రోవర్

ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కేంద్రం ధాన్య కొనుగోళ్ల విషయం పట్టించుకోవట్లేదని టీఆర్ఎస్ అంటుంటే..తెలంగాణ ప్రభుత్వం చేతకానితనం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని..అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని బీజేపీ విమర్శిస్తోంది. ఈక్రమంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయసభల్లోను టీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణలో ధాన్య కొనుగోళ్లు చేయకుండా తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఆరోపిస్తు ఆందోళన చేస్తున్నారు.వీరి ఆరోపణల్ని కేంద్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఇక పార్లమెంట్ సమావేశాలు మొత్తాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకుంది.