AP Employees: ఉద్యోగుల పోరుబాట.. నేటి నుంచి ఏపీలో నిరసనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిమాండ్ల సాధన కోసం ఉద్యమబాట పట్టారు ఉద్యోగులు.

AP Employees: ఉద్యోగుల పోరుబాట.. నేటి నుంచి ఏపీలో నిరసనలు

Ap Employees

AP Employees: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిమాండ్ల సాధన కోసం ఉద్యమబాట పట్టారు ఉద్యోగులు. నేటి నుంచి నిరసనబాట కార్యక్రమాలు ప్రారంభించారు. మొత్తం 71 డిమాండ్లతో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నట్లు ప్రకటించాయి ఏపి జేఏసి, ఏపి అమరావతి జేఏసి ఉద్యోగ సంఘాలు. ఈరోజు నుంచి 10వ తేదీ వరకు నల్ల బ్యాడ్జిలతో విధులకు హాజరు కానున్నారు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికు సంఘాలు.

పదవ తేదీ నుంచి నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేస్తూ.. భోజన విరామంలో ఆందోళన చేపట్టనున్నారు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు. ఇటీవల అమరావతి సచివాలయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన కార్యదర్శుల సమావేశంలో కూడా ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వం నుంచి స్పష్టతా రాలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం 3 జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించింది.

ప్రతి సమావేశంలోనూ సంఘాలు 11వ పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే 13వ తేదీన నిరసన ర్యాలీలు, సమావేశాలు నిర్వహించనున్నారు. 16వ తేదీన ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు అన్ని తాలూకా, డివిజన్, HOD కార్యాలయాలు, ఏపీఎస్‌ఆర్‌టీసీ డిపోల వద్ద ధర్నాలు నిర్వహిస్తారు.

21వ తేదీ జిల్లా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ధర్నాలు నిర్వహిస్తారు. 27వ తేదీ నుంచి జనవరి 2వ తేది వరకు అన్ని డిజిజన్ స్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తారు. 27వ తేదీన విశాఖపట్నం, 30వ తేదీన తిరుపతి, జనవరి 3వ తేదిన ఏలూరు, జనవరి 6వ తేదిన ఒంగోలు ప్రాంతాల్లో డివిజన్ లెవెల్ సమావేశాలు నిర్వహించనున్నారు ఏపి జేఏసి, ఏపి అమరావతి జేఏసి నేతలు, నాయకులు.

VJ Sunny : సన్నీకి అత్త అవ్వాల్సింది.. పిన్ని అయ్యాను

రాష్ట్రంలోని 13లక్షల మంది ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించకపోవడంతో.. ఉద్యమ బాట పడుతున్నట్లు ఇప్పటికే వెల్లడించారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బోప్పరాజు వెంకటేశ్వర్లు. అయితే, ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ ఉద్యమాన్ని కొన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

ది పీటీడీ వైఎస్ఆర్ ఎంప్లాయిస్ అసోషియేషన్, ఆంధ్రప్రదేశ్ గజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం, ఏపి గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఈ నిరసనలను వ్యతిరేకిస్తున్నాయి. సీఎం జగన్ రెడ్డి ఉద్యోగుల సంక్షేమంపైన, డిమాండ్లపైన హామీ ఇచ్చినా ఆందోళన అర్థరహితం అంటూ వారు అభిప్రాయపడుతున్నారు.