Liquor Prices: తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు
మందుబాబులకు షాకిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రేపటి నుంచి మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19, గురువారం నుంచి పెరిగిన మద్యం ధరలు అమలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది.
- Narender Thiru
- Published On : May 18, 2022 / 10:03 PM IST
Liquor Prices
Liquor Prices: మందుబాబులకు షాకిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రేపటి నుంచి మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19, గురువారం నుంచి పెరిగిన మద్యం ధరలు అమలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. పెరిగిన ధరలను రేపు ఉదయం ప్రకటిస్తారు. బుధవారం మద్యం అమ్మకాల తర్వాత వైన్ షాపులను ఎక్సైజ్ శాఖ సీజ్ చేస్తుంది. మిగిలిన మద్యాన్ని లెక్కించి, వాటిని కొత్త ధరలకు అమ్మేలా చూస్తారు. రేపటి నుంచి పెరిగిన ధరలకు మద్యం అమ్మాలని ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. అయితే, ధరలు పెంచుతూ పాత స్టాక్‌పైన భారం వేయడంపై వైన్ షాపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్‌గా స్ట్రాటజిస్ట్ సర్వే వ్యవహారం
ప్రాథమిక అంచనా ప్రకారం.. పది శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. క్వార్టర్ మద్యం బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.80 వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే బీర్ల ధరలను కూడా ప్రభుత్వం పెంచనుంది. బీర్లపై సగటున రూ.20 వరకు పెంపు ఉండొచ్చని భావిస్తున్నారు.
