Sarkaru Vaari Paata: అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన థమన్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న.....

Thaman Big Update On Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో అల్ట్రా స్టైలిష్ లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు మహేష్ బాబు సిద్ధమయ్యాడు. ఇక ఓ సరికొత్త కథాంశంతో ఈ సినిమా వస్తుండటంతో సర్కారు వారి పాట చిత్రంపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Sarkaru Vaari Paata: ఉగాది పర్వదినాన సర్కారు వారి పాట నుండి థర్డ్ సింగిల్?

కాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్, కళావతి, పెన్నీ లిరికల్ సాంగ్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. కాగా ఈ సినిమా షూటింగ్‌ను త్వరలో ముగించేసి సినిమాను వేసవి కానుకగా మే నెలలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సినిమాకు థమన్ అద్భుతమైన సంగీతం అదనపు బలంగా మారబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలకు ప్రేక్షకుల నుండి స్టన్నింగ్ రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమాలో ఆయన ఇచ్చే మ్యూజిక్‌కు ప్రేక్షకులు నీరాజనం పట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Sarkaru Vaari Paata: పెన్నీ సాంగ్.. మహేష్ క్రేజ్‌కు మరో మచ్చుతునక!

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి థమన్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సర్కారు వారి పాట చిత్రానికి సంబంధించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వర్క్ జరుగుతుందని, ఈ సినిమాకు అద్భుతమైన ట్యూన్స్ కుదిరాయని థమన్ అన్నారు. ఈ సినిమా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం ఖాయమని థమన్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరి నిజంగానే ‘సర్కారు వారి పాట’కు థమన్ అందించే బీజీఎం ఆ రేంజ్‌లో ఉంటుందా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.