Sarkaru Vaari Paata: ఉగాది పర్వదినాన సర్కారు వారి పాట నుండి థర్డ్ సింగిల్?

ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది సర్కారు వారి పాట. ఎంత స్పీడ్ గా షూటింగ్ ను చుట్టేస్తున్నారో.. అంతే స్పీడ్ తో ప్రమోషనల్ కంటెంట్..

Sarkaru Vaari Paata: ఉగాది పర్వదినాన సర్కారు వారి పాట నుండి థర్డ్ సింగిల్?

Sarkaru Vaari Paata

Updated On : March 31, 2022 / 7:55 AM IST

Sarkaru Vaari Paata: ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది సర్కారు వారి పాట. ఎంత స్పీడ్ గా షూటింగ్ ను చుట్టేస్తున్నారో.. అంతే స్పీడ్ తో ప్రమోషనల్ కంటెంట్ ను వదిలేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చూస్తుండగానే రిలీజ్ డేట్ దగ్గరపడుతుంది. అందుకే షూటింగ్, ప్రమోషన్, పోస్ట్ ప్రొడక్షన్ అంటూ ఇప్పుడు రచ్చంతా సూపర్ స్టార్ మూవీదే కనిపిస్తోంది. ఓవైపు షూటింగ్.. మరోవైపు ప్రమోషన్స్.. రెండు పనులు ఒకేసారి చేస్తూ సర్కారు వారి పాట సందడి చేస్తోంది.

Sarkaru Vaari Paata: పెన్నీ సాంగ్.. మహేష్ క్రేజ్‌కు మరో మచ్చుతునక!

షూటింగ్ అయ్యాక తీరిగ్గా పబ్లిసిటీ చేసుకునే టైమ్ లేదు కాబట్టి గ్యాప్ ఇవ్వకుండా ఆడియెన్స్ ను ఎంగేజ్ చేస్తున్నారు సర్కారు అండ్ టీం. ఇంకేముంది.. ఇదే.. ఈ రేంజ్ స్టఫ్పే కావాలని ఎదురుచూస్తున్న మహేశ్ ఫ్యాన్స్ కూడా.. వచ్చిన అప్ డేట్స్ ను వచ్చినట్టు ట్రెండ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పటికే కళావతీ అంటూ చేసిన హంగామా.. పెన్నీ సాంగ్ యూట్యూబ్ లో హవా చూపించిన సంగతి తెలిసిందే.

Sarkaru Vaari Paata: సెంచరీ కొట్టిన కళావతి.. మహేష్ స్టెప్స్‌కు జనం ఫిదా!

కాగా, ఇప్పుడు థర్డ్ సింగిల్ కి కూడా సమయం ఆసన్నమైనట్లు తెలుస్తుంది. ఉగాది రోజున ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్‌ని వదలనున్నారనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. మరీ నిజంగా ఉగాదికి థర్డ్ సాంగ్ రిలీజ్ చేస్తారా? లేక మరేదైనా అప్డేట్‌ని ప్లాన్ చేసారా? అనే దానిపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉండగా.. మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.