Pawan Kalyan: పవన్‌కు మరోసారి అదే వాయింపుడు?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్‌ను అందుకున్న....

Thaman To Give Music Once Again For Pawan Kalyan Movie
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా చిత్ర యూనిట్ రూపొందించారు. ఇక ఈ సినిమాలో పవన్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేశారు. అటు మరో హీరో రానా దగ్గుబాటి పవర్‌ఫుల్ నటన ఈ సినిమాకు మరో ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరి మధ్య వచ్చిన యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది.
Pawan Kalyan: ఆ డైరెక్టర్‌ను పవన్ పక్కనబెట్టాడా?
ఇక ఈ సినిమాకు మరో మేజర్ అట్రాక్షన్ థమన్ అందించిన సంగీతం అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ సీన్స్‌ను తన బీజీఎంతో థమన్ ఎలివేట్ చేసిన విధానం సూపర్బ్‌గా ఉండటంతో పవన్ తన నెక్ట్స్ చిత్రానికి కూడా అతడినే సంగీత దర్శకుడిగా పెట్టుకోవాలని చూస్తున్నాడట. ఈ క్రమంలో పవన్ మరో రీమేక్ చిత్రంపై కన్నేసినట్లు గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో నటుడు, దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన ‘వినోదాయ సీతం’ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.
ఈ సినిమా తనకు తెగ నచ్చడంతో పవన్ ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి థమన్ అద్భుతమైన సంగీతం అందించాలని పవన్ అతడిని కోరినట్లు చిత్ర వర్గాల టాక్. దీనికి థమన్ కూడా వెంటనే ఓకే చెప్పేశాడట. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
Pawan Kalyan: పవర్ ట్రీట్.. పవన్ బ్యాక్ టూ బ్యాక్ రీమేక్స్
కాగా ఈ సినిమాకు కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రిప్టు వర్క్, మాటల సాయం అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను తెలుగులో కూడా సముద్రఖని స్వయంగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని, అలాగే రెగ్యులర్ షూటింగ్‌ను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడట. మరి వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తరువాత పవన్-థమన్ కాంబోలో రాబోతున్న ఈ హ్యాట్రిక్ చిత్రం కోసం థమన్ ఎలాంటి మ్యూజిక్ అందిస్తాడో చూడాలి.