Thara Tharala Charitham : వరల్డ్స్ ఫస్ట్ 360 డిగ్రీస్ మూవీ.. ‘తరతరాల చరితం’..

‘తరతరాల చరితం’ మూవీతో ప్రపంచపు తొలి 360 డిగ్రీల సినిమాను రూపొందించారు దర్శకుడు శేఖర్ యాదవ్. ప్రస్థానం మార్క్స్ పతాకంపై నిర్మాత భవానీ శంకర్ కొండోజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సరికొత్త కథా కథనాలతో తెరకెక్కిన తరతరాల చరితం సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో జయలలిత, చిత్రం శ్రీను, ఆనంద్ భారతి, గోవర్థన్ రెడ్డి, నిహారిక రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Thara Tharala Charitham : వరల్డ్స్ ఫస్ట్ 360 డిగ్రీస్ మూవీ.. ‘తరతరాల చరితం’..

Thara Tharala Charitham

Updated On : April 18, 2021 / 6:04 PM IST

Thara Tharala Charitham: ‘తరతరాల చరితం’ మూవీతో ప్రపంచపు తొలి 360 డిగ్రీల సినిమాను రూపొందించారు దర్శకుడు శేఖర్ యాదవ్. ప్రస్థానం మార్క్స్ పతాకంపై నిర్మాత భవానీ శంకర్ కొండోజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సరికొత్త కథా కథనాలతో తెరకెక్కిన తరతరాల చరితం సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో జయలలిత, చిత్రం శ్రీను, ఆనంద్ భారతి, గోవర్థన్ రెడ్డి, నిహారిక రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

‘తరతరాల చరితం’ ట్రైలర్ చూస్తే… ఒక సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ‘రెడ్ కలర్ ఆల్సో టెల్ ద స్టోరీ’ అనే క్యాప్షన్ ట్రైలర్ ప్రారంభంలో వేశారు. ఇద్దరు ప్రధాన పాత్ర ధారులు ఒకరికొకరు పిస్టల్స్ గురి పెట్టుకోవడం, ఇంతలో చిత్రం శ్రీను లాంటి మరికొన్ని క్యారెక్టర్స్ పరిచయం చేశారు. చార్మినార్, తాజ్ మహల్, ట్యాంక్ బండ్‌లోని బుద్ధ విగ్రహం లాంటి ఐకానిక్ స్థలాలను ఫ్లాష్‌గా చూపించారు. ఇక్కడే సెకండాఫ్ బిగిన్స్ అని చూపించారు. సినిమాలోని ప్రధాన పాత్రలు కొన్ని మర్డర్ ప్లాన్స్ చేసే నేపథ్యంటో డైలాగ్స్ ఉన్నాయి. చివరలో ఒక స్కూల్ స్టూడెంట్ భయపడుతూ ‘నాన్నా.. నేను చచ్చిపోతాను అనిపిస్తోంది నాన్నా’.. అనే డైలాగ్‌తో ట్రైలర్ ఎండ్ అయ్యింది.

మొత్తంగా ‘తరతరాల చరితం’ మూవీ ట్రైలర్ కాలం ఎంత మారినా మనుషుల్లో మారని ఒక స్వభావాన్ని చూపిస్తోందని అర్థం చేసుకోవచ్చు. మనుషుల భావోద్వేగాల్లోని సారూప్యతలు చెప్పేందుకు ప్రయత్నిస్తుందీ ట్రైలర్.. త్వరలో విడుదల తేది ప్రకటించనున్నారు.. యోగి, వర్ష, మను, ఆ శేఖర్ యాదవ్, చందు, సుజిత్, శంకర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – సుభాష్ ఇషాన్, డైలాగ్స్ – నాత్మిక, సినిమాటోగ్రఫీ – కిరణ్ కుమార్ దీకొండ, ఎడిటర్ – శ్రీనివాస్ అన్నవరపు, ఆర్ట్ – అడ్డాల పెద్దిరాజు, కాస్ట్యూమ్స్ – సండ్ర శ్రీధర్, ఆడియోగ్రఫీ – రంగరాజు, సౌండ్ డిజైన్ – రఘునాథ్ కామిశెట్టి, సౌండ్ ఎఫెక్ట్స్ – యతిరాజ్, నిర్మాత – భవానీ శంకర్ కొండోజు, రచన – దర్శకత్వం – శేఖర్ యాదవ్..