The Family Men 2 : ఎవరు ఎంత తీసుకున్నారో తెలుసా..!
ఈ సిరీస్ కోసం లీడ్ రోల్స్ చేసిన మెయిన్ ఆర్టిస్టుల పారితోషికాల వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

The Family Men 2
The Family Men 2: ‘ది ఫ్యామిలీ మెన్ 2’ సిరీస్ కోసం ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్ చేశారు. సమంత యాక్ట్ చేస్తుందనగానే ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెరిగాయి. అయితే ప్రోమోస్ రిలీజ్ చేసిన దగ్గరినుండి సమంత క్యారెక్టర్ గురించి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒకానొక టైంలో అసలు ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందో, లేదో అనే డౌట్స్ కూడా ఎక్స్‌ప్రెస్ చేశారు ఆడియెన్స్.
కట్ చేస్తే.. ‘ది ఫ్యామిలీ మెన్ 2’ విమర్శలను పట్టించుకోకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ సిరీస్‌లో చూసిన పాత్రల సంగతి పక్కన పెడితే, డిజిటల్ డెబ్యూతో రాజీ క్యారెక్టర్‌లో సమంత పర్ఫార్మెన్స్ పిచ్చ పీక్స్ అనేశారు చూసినవాళ్లంతా.. రోల్‌కి తగ్గట్టు బోల్డ్‌గా కనిపించడంతో పాటు.. యాక్షన్ సీన్స్‌లోనూ సమంత అదరగొట్టేసింది.
అయితే కొద్దిరోజులుగా ఈ సిరీస్‌కి సంబంధించి సామ్ రెమ్యూనరేషన్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. సమంత ఈ రేంజ్‌లో యాక్ట్ చేసిందంటే.. గట్టిగానే ముట్టచెప్పుంటారు అనుకున్నారంతా.. ఈ సిరీస్ కోసం లీడ్ రోల్స్ చేసిన మెయిన్ ఆర్టిస్టుల పారితోషికాల వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
‘ఫ్యామిలీ మెన్’ మెయిన్ పిల్లర్, శ్రీకాంత్ తివారి క్యారెక్టర్‌లో ఎప్పటిలానే తన స్టైల్ నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న మనోజ్ బాజ్‌పాయ్- 10 కోట్లు, రాజీ రోల్‌లో రాజీ పడకుండా అదరగొట్టిన సమంత – 4 కోట్లు, హౌస్ వైఫ్‌గా, వర్కింగ్ వుమెన్‌గా అలరించిన ప్రియమణి – 80 లక్షలు, మనోజ్ బాజ్‌పాయ్ కూతురిగా నటించిన అశ్లేషా ఠాకూర్ – 50 లక్షలు, ప్రియమణి బాయ్‌ఫ్రెండ్ అరవింద్ క్యారెక్టర్ చేసిన శరద్ కేల్‌కర్ – 1.6 కోట్లు, మనోజ్ బాజ్‌పాయ్ కొలీగ్ జె.కె. తలపడే పాత్ర పోషించిన షరీబ్ హష్మీ – 65 లక్షలు, మేజర్ సమీర్‌గా నటించిన దర్శన్ కుమార్ – 1 కోటి, మిలింద్ అహూజా రోల్‌లో కనిపించిన సన్నీ హిందూజా – 60 లక్షలు.
Samantha : సామ్ నటనకు నేషనల్ వైడ్ రెస్పాన్స్.. బాలీవుడ్ సినిమాలపై ఫోకస్..?