Samantha : సామ్ నటనకు నేషనల్ వైడ్ రెస్పాన్స్.. బాలీవుడ్ సినిమాలపై ఫోకస్..?

ఇన్ని సినిమాలు చేసినా రాని నేమ్, ఫేమ్ ఒకే ఒక్క వెబ్ సిరీస్‌తో వచ్చేసింది.. ఓవర్ నైట్ పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకుంది సమంత..

Samantha : సామ్ నటనకు నేషనల్ వైడ్ రెస్పాన్స్.. బాలీవుడ్ సినిమాలపై ఫోకస్..?

Samantha Akkineni Gets Tremendous Response For Raji Role In The Family Men 2

Samantha: ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న హాట్ నేమ్.. సమంతా.. పెళ్లి తర్వాత సినిమాలేంటీ, గ్లామర్ షో లేంటి అన్న వాళ్లకి నెగెటివ్ రోల్స్ కూడా చేస్తూ.. తన వెర్సెటాలిటీని ప్రూవ్ చేసుకుంటోంది. ఇన్ని సినిమాలు చేసినా రాని నేమ్, ఫేమ్ ఒకే ఒక్క వెబ్ సిరీస్‌తో వచ్చేసింది.. ఓవర్ నైట్ పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకుంది సమంత..

‘ఫ్యామిలీ మెన్’.. ఓ సూపర్ సక్సెస్ సిరీస్.. అయితే దీనికి సీక్వెల్‌గా రాబోతున్న ఎపిసోడ్స్‌లో సమంత నటిస్తున్నారనగానే సౌత్ ఆడియెన్స్‌లో క్రేజ్ మొదలైంది. ఆ తర్వాత సామ్ చేస్తున్నది టెర్రరిస్ట్ రోల్ అనగానే పెదవి విరిచారు చాలామంది. ఇక ట్రైలర్ వివాదాలన్నీ సామ్ క్యారెక్టర్ చుట్టూనే తిరిగాయి. ఇంత జరిగినా సైలెంట్‌గానే ఉన్న సమంత.. రీసెంట్‌గా రిలీజ్ అయిన సిరీస్‌తో నెగెటివ్ రోల్ ప్లే చేసినా కూడా నేషనల్ వైడ్ ఫేమ్ దక్కించుకుంది.

The Family Man 2 : సమంత క్యారెక్టర్ ఎంత పని చేసింది..? ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ చుట్టూ వివాదాలు..

మంచి రోల్ పడాలే కానీ యాక్టింగ్‌తో అట్రాక్ట్ చేస్తారు సమంత. ‘రంగస్థలం’, ‘ఓ బేబి’, ‘మజిలీ’, ‘యూ టర్న్’ సినిమాలు సామ్‌ని కొత్తగా ప్రెజెంట్ చేసినవే. ఇక చైతుతో పెళ్లి తర్వాత దాదాపు గ్లామర్ రోల్స్  పక్కన పెట్టేశారు. ‘శాకుంతలం’ వంటి భారీ ప్రాజెక్ట్‌తో నేషనల్ వైడ్ ప్రొజెక్టయేందుకు ట్రై చేస్తున్నారు. అయితే అంతకన్నా ముందే.. రీసెంట్ వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా యాక్ట్రెస్ అన్న ఫీట్ అచీవ్ చేసినట్టే..  సామ్ నేషనల్ స్టార్ అయిపోయినట్టేనన్న కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి.

అటు సినిమాలతో పాటు ఓటీటీలో కూడా ఛాలెంజింగ్ రోల్ ఎంచుకొని ఫ్యాన్స్‌కు బ్లాస్టింగ్ ట్రీట్ ఇచ్చారు. అంతలా నెగెటివ్ రోల్‌తో సౌత్‌లోనే కాకుండా అటు బాలీవుడ్ ఆడియన్స్‌ని కూడా బుట్టలో వేసేసింది. ఇప్పటికే డిఫరెంట్ సినిమాలు చేస్తూ.. ట్రెండ్ క్రియేట్ చేస్తున్న సమంత యాక్టింగ్‌కి నార్త్ వాళ్లు కూడా ఫిదా అయిపోయారు. ఇక ఈమధ్యే రణ్‌బీర్ కపూర్‌తో నటించాలనుందనే డిజైర్‌ను బయటపెట్టారు. చూస్తుంటే సామ్‌కి వరుస బాలీవుడ్ ఆఫర్స్ తలుపు తట్టినా ఆశ్చర్యంలేదనే టాక్ నడుస్తోంది..